Advertisement
Google Ads BL

ప్రమోషన్స్ స్టేజ్ పై ఎక్కువవుతున్న పైత్యం


ఒకప్పుడు సినిమా రిలీజ్ ముందస్తు కార్యక్రమాలంటే స్పీచ్ లని జనం ఎంజాయ్ చేసేవారు. బాలకృష్ణ లాంటి స్థాయి వ్యక్తులు సదరు సినిమాలోని డైలాగులు ముందుగానే స్టేజ్ పై చెబుతుంటే.. విజిల్స్ కొట్టి వెర్రెత్తిపోయేవారు. అలా ఉండేది సినిమా ప్రమోషన్, ఆ విధంగా జరిగేది పబ్లిసిటీ. ఇప్పుడు మొదలైన వంకరు కింకరు పద్ధతుల్లో కొత్తపుంతలు కాదు కాదు చెత్తపుంతలు తొక్కుతున్నాయి పబ్లిసిటీ ఈవెంట్స్.  

Advertisement
CJ Advs

సినిమా ప్రమోషన్స్ కోసం హీరో-హీరోయిన్స్ ఈమధ్యన ఎంతకైనా దిగజారుతున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోనే స్టేజ్ పై డాన్స్ చేస్తే లేదు కానీ.. మేము వేస్తె వచ్చిందా అన్నట్టుగా కొంతమంది హీరో-హీరోయిన్స్ స్టేజ్ పై రెచ్చిపోతున్నారు. అలా చేస్తే సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి.. లేదంటే రావు అన్నట్టుగా ఫిక్స్ అవ్వబట్టే.. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో.. లేదంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనో హీరో-హీరోయిన్స్ జతకట్టి స్టేజ్ పై డాన్స్ చేస్తున్నారు. కాలు కదిపితే తప్పు లేదు.. కానీ పైత్యం ముదితేనే కష్టం. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు ఈవెంట్స్ జరిగాయి. 

అందులో మొదటిది విజయ్ దేవరకొండ-సమంత కాంబోలో తెరకెక్కిన ఖుషి మూవీ మ్యూజికల్ కాన్సెర్ట్. అందులో భాగంగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ షర్ట్ విప్పేసి సమంతని గాల్లోకి ఎగరేస్తూ చేసిన డాన్స్ అభిమానుల చేత విజిల్స్ వేయించినా.. అంత అసభ్యంగా డాన్స్ చెయ్యాల్సిన అవసరం మాత్రం కనిపించలేదు. అంటే ప్రమోషన్స్ కోసం ఏమైనా చేస్తారా.. స్టేజ్ పై విజయ్-సమంత కెమిస్ట్రీ కోసం ఏమేం చేసారో సోషల్ మీడియా నిండా అవే కనిపించాయి. 

ఈరోజు బుధవారం విశ్వక్ సేన్-నేహా శెట్టిలు నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరిలోని సుట్టంలా సూసి సాంగ్ లాంచ్ వేడుక మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఈ ఈవెంట్ లో స్టేజ్ పై రెచ్చిపోయి డాన్స్ చేసారు హీరో-హీరోయిన్స్. నేహా శెట్టి అయితే సారీ విప్పేసి లోపలికి విశ్వక్ ని లాగుతూ చేసిన డాన్సులు, వారి కౌగిలింతలు, ముద్దులు అక్కడైతే క్లాప్స్ కొట్టించింది కానీ ఆ చర్యలు పలు విమర్శలకి దారి తీసింది. విశ్వక్ సేన్-నేహా శెట్టిలు చేసిన అసభ్యకర డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఇది చూసిన నెటిజెన్స్ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతగా దిగజారిపోవాలా.. పద్దతిగా సినిమాని ప్రమోట్ చేస్తే సరిపోదా.. ఓపెనింగ్స్ కోసం ఇలాంటివేనా చేసేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Increasing bitterness on the promotion stage:

Vishwak Sen and Neha Shetty dance performance at Gangs Of Godavari song launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs