సమంత మీడియా ముందు యాక్టీవ్ గా లేకపోయినా.. విహార యాత్రలో సరదాగా ఉండడాన్ని నెటిజెన్స్ లైట్ తీసుకోలేకపోయారు. ఖుషి ట్రైలర్ లాంచ్ లో సమంత కనిపించలేదు. దానితో సమంతని టార్గెట్ చేసారు రౌడీ ఫాన్స్. ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమాలు చేసే సమంత అనారోగ్యాన్ని లెక్క చెయ్యకుండా షూటింగ్స్ కి హాజరైనా.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసారు. ఆ విషయంలో ఫీలైన సమంత సోషల్ మీడియా వేదికగా ఇచ్చిపడేసింది.
అయితే నిన్న మంగళవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఖుషి మూవీ మ్యూజికల్ నైట్ లో సమంత-విజయ్ దేవరకొండ పాల్గొనడమే కాదు.. అభిమానులని తమ డాన్స్ లతో సర్ ప్రైజ్ చేసారు. సమంత స్టేజ్ పై విజయ్ దేవరకొండ తో కలిసి స్టెప్స్ వెయ్యడమే కాదు.. వారిద్దరి కెమిస్ట్రీకి ఫాన్స్ క్లాప్స్ కొట్టారు. సమంత డాన్స్ చేసేప్పుడు గ్లామర్ గాను అందంగానూ కనిపించింది. అలాగే స్టేజ్ పై కి సారీ లో దర్శనమిచ్చింది. అయితే సమంత ని ఇంకా హెల్త్ రీజన్స్ వెంటాడుతున్నాయనడానికి ఉదాహరణ.. ఆమె మోహంలో కనిపించిన నీరసమే.
అటు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సమంత ఇప్పటికి నీరసంగానే ఉంది.. కానీ ఖుషి ప్రమోషన్స్ కోసం ఆమె చాలా ఓపిగ్గా అదంతా భరిస్తుంది. సామ్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాడు. సమంత ఇకపై ఖుషి ప్రమోషన్స్ లో కనిపించకపోయినా అభిమానులు కానీ, నెటిజెన్స్ కానీ ఎలాంటి కామెంట్ చేసే అవకాశం ఇవ్వకుండా ఈ మ్యూజికల్ కాన్సెర్ట్ లో ఆమె పెరఫార్మెన్స్, ఆమె గ్లామర్, ఆమె లుక్స్ అన్ని ఫిదా చేసాయి. ఈ ఒక్కటి చాలు సామ్ అనేలా చేసాయి.