Advertisement
Google Ads BL

మెగాస్టార్ మోకాలి సర్జరీ కంప్లీట్


తమిళ్ హిట్ మూవీ వేదాళంని తెలుగులో ఎనిమిదేళ్ల తర్వాత భోళా శంకర్‌గా మెగాస్టార్ చిరంజీవి అవుట్ డేటెడ్ దర్శకుడు మెహర్ రమేష్‌తో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రిజల్ట్‌తో అన్ హ్యాపీగా ఉండడం ఏమో కానీ.. మెగా ఫాన్స్ మాత్రం ఆయన్ని మరో ఇక రీమేక్స్ వద్దు అన్నట్టుగా రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విపరీతమైన విమర్శలు మొదలయ్యాయి. 

Advertisement
CJ Advs

అదలా ఉంటే చిరు మోకాలి సర్జరీపై గత నాలుగు రోజులుగా వస్తున్న వార్తల నేపథ్యంలో మెగాస్టార్ చిరు తన మోకాలికి సర్జరీ చేయించేసుకున్నారట. ఢిల్లీలో ఆర్దోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ తీసుకున్నారట. ఇక మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో ఆయన ఓ వారం విశ్రాంతితో మళ్ళీ హైదరాబాద్‌కి వచ్చేస్తారట. అంటే మెగాస్టార్ చిరు తన పుట్టిన రోజునాటికి హైదరాబాద్‌లోనే ఉంటారని తెలుస్తుంది. 

చిరు రెండు నెలల విశ్రాంతి తర్వాతే తన కొత్త సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారని.. ఆగష్టు 22న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో Mega 157ని అఫీషియల్‌గా పూజా కార్యక్రమాలతో మొదలు పెడతారని తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో చిరు పాల్గొనరని.. నిర్మాతలు, దర్శకుడు మాత్రమే ఈ పూజకు ఉండబోతున్నట్లుగా టాక్ అయితే ఉంది.

Mega Star Knee Surgery Completed Successfully :

Chiranjeevi Knee Surgery Completed at Delhi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs