Advertisement
Google Ads BL

ఫైనల్‌గా ఆ అమ్మాయేనా.. ఆది!


జబర్దస్త్ ద్వారా ఫేమస్ అవడమే కాదు.. టాప్ కమెడియన్‌గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వెండితెర మీద బిజీ అవడం, అలాగే సినిమాలకు డైలాగ్స్ రాయడంతో పాపులర్ అయిన హైపర్ ఆది.. ప్రస్తుతం జబర్దస్త్ పక్కన పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షోలో కామెడీని పండిస్తున్నాడు. అంతేకాకుండా వెండితెర మీద కూడా తన టాలెంట్ చూపిస్తున్నాడు. జబర్దస్త్‌కి వచ్చి పదేళ్లు అయినా హైపర్ ఆది ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆది చేసుకోబోయే అమ్మాయిపై అందరిలో విపరీతమైన ఆసక్తి ఉంది. 

Advertisement
CJ Advs

ఆది చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది, ఆమెకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి.. చుట్టాలమ్మాయిని చేసుకుంటాడా.. లేదంటే ఫ్యామిలీ చూపించిన అమ్మాయితో ఏడడుగులు వేస్తాడా.. కాదు ఎవరినైనా ఆది ప్రేమించాడా? అనే విషయంలో ఎవరి ఊహల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఆది అందరికీ షాకిస్తూ ఇప్పటివరకు కంటెంట్ కోసం అందరికీ లైన్ వేశాను కానీ నేను ప్రేమించిన అమ్మాయి ఇక్కడే ఉంది అంటూ ట్విస్ట్ ఇస్తూ.. రా బేబీ అంటూ ఆమెని స్టేజ్ పైకి పిలిచాడు. 

ఓ షో లో తన ప్రియురాలిని స్టేజ్ పైకి పిలిచి అందరికి పరిచయం చేశాడు. బేబీ అనగానే నవ్వులు చిందిస్తూ ఓ అమ్మాయి రాగానే.. అమ్మాయి పేరు విహారిక అంటూ ఆమెకి స్టేజ్ మీదే ప్రపోజ్ చేస్తూ ఐ లవ్ యు చెప్పుకోవడమే కాదు.. ఒకరి బుగ్గ మీద ఒకరు ముద్దుపెట్టుకున్నట్టుగా కట్ చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ షో వచ్చే ఆదివారం ప్రసారం కాబోతుంది. మరి ఆది నిజంగానే అమ్మాయిని పరిచయం చేశాడా.. లేదంటే ఇది కూడా ఈ షో కోసమేనా అనేది మాత్రం బుల్లితెర ప్రేక్షకులు ఆలోచనలతో బుర్రలు పగలగొట్టేసుకుంటున్నారు.

Hyper Aadi Introduced His Girl Friend at Sridevi Drama Company:

Hyper Aadi Girl Friend Viharika Introduced
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs