Advertisement
Google Ads BL

ముంబైలో మకాం.. సూర్య ఏమన్నారంటే?


కొద్దిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తండ్రితో విభేదించి ముంబైలో మకాం పెట్టారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భార్య జ్యోతికకు తన కుటుంబ సభ్యులకు పడకపోవడంతోనే సూర్య ఇలా ముంబైకి షిఫ్ట్ అయ్యారని.. తరచూ ముంబైలో కనబడుతున్న సూర్య తన పిల్లలని ఫొటోస్ కూడా తీయనివ్వరనే విషయం తెలిసిందే. తన పిల్లలని ఫోటోల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు అంటూ సూర్య మీడియా వారిని కోరుకుంటూ ఉంటారు. 

Advertisement
CJ Advs

ఇక చెన్నై నుండి ఆల్మోస్ట్ సూర్య ముంబైకి వెళ్లిపోయారనేలా వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ విషయమై సూర్య క్లారిటీ ఇచ్చారు. తాజాగా సూర్య ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొనగా.. ఆయన ముంబైకి షిఫ్ట్ అయ్యారనే వార్తలపై స్పందించమని అడగగా.. దానికి సూర్య అలాంటిదేమి లేదు.. తాను ముంబై షిఫ్ట్ అవ్వలేదు.. పిల్లల చదువుల కోసమే ముంబైలో ఉంటున్నామని తెలిపారు. 

తన కుమార్తె, కొడుకు చదువు కోసం ముంబైలో ఉన్నామని, తను మాత్రం చెన్నై‌లోనే ఉంటున్నట్టు స్పష్టం చేశారు. తను మంచి కొడుకుగా, మంచి నాన్నగా, మంచి భర్తగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాకుండా తాను జీవితంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్‌తోనే నటుడు మాధవన్‌తో కలిసి కొన్ని రోజులుగా గోల్ఫ్ ఆడుతున్నట్టు చెప్పారు.

Suriya Did Not Shift To Mumbai:

Suriya Rubbishes Mumbai Shift
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs