Advertisement
Google Ads BL

ఫైనల్ గా మిస్ శెట్టికి మోక్షం


ఎన్నో రిలీజ్ డేట్స్ మార్చుకుని ఫైనల్ గా ఇప్పుడొక డేట్ తో దిగుతున్నారు.. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి లు. వారిద్దరూ నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతున్నట్టుగా మేకర్స్ మళ్ళీ ఓ కొత్త పోస్టర్ తో ప్రకటించారు. సోమవారం ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ప్రకటించారు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జ్యోతిష్యుడు రంగస్థలం మహేశ్ ను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ చెప్పమని అడగడం, అతను 70,80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకోమని అనడం..చివరకు నవీన్ పోలిశెట్టి హే కృష్ణా అంటూ ఉట్టికొట్టి కృష్ణాష్టమికి మా సినిమాను తీసుకొస్తున్నాం అని ప్రకటించడం ఇంట్రెస్టింగ్ గా, హ్యూమర్ క్రియేట్ చేసింది.

అనౌన్స్ మెంట్ నుంచి అందరిలో ఆసక్తి కలిగించింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఉండటంతో సినిమా చూసేందుకు ఈ హాలీడేస్ ఆడియెన్స్ కు కలిసిరానున్నాయి.

Miss Shetty Mr. Polishetty is releasing on September 7:

Miss Shetty Mr. Polishetty is releasing on September 7 on the occasion of Sri Krishna Janmashtami
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs