Advertisement
Google Ads BL

భోళా శంకర్ ప్లాప్-జబర్దస్త్ బ్యాచ్ టార్గెట్


మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ రిజల్ట్ ఏమిటో మొదటి రోజు మొదటి షోకే జనాలకు అర్ధమైపోయింది. అయితే సినిమా పోవడం కేవలం జబర్దస్త్ బ్యాచ్ వల్లే జరిగిందా? అంటే జబర్దస్త్ హైపర్ ఆది భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ పై చేసిన స్పీచ్ తెగ వైరల్ అయ్యింది. ఆది ఎక్కువగా మెగాస్టార్ ని పొగడడమే కాకుండా ఆయన్ని కించపరిచేవారికి డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే చాలామంది చిరుని అన్నయ్య అన్నయ్య అంటూ భజన చేస్తూ ఆయనని చెడగొడుతున్నారా.. ఇదే నిజమంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు దర్శనమిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ముందుగా రామ్ గోపాల్ వర్మ భోళా ప్లాప్ అవడం జబర్దస్త్ వాళ్ళ వల్లే అంటూ చేసిన ట్వీట్ వైరలయ్యింది. భోళా శంకర్ డిసాస్టర్ వెనుక దర్శకుడు, స్క్రీన్ ప్లే, మిగతా టెక్నీకల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది హీరో సరిగ్గా చెయ్యకపోతే హీరోని బ్లేమ్ చేస్తారు. అంతేకాని.. జబర్దస్త్ వాళ్ళు ఏం చేసారని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలామంది పనిగట్టుకుని ఈ మధ్యన చిరంజీవికి అతిగా భజన చేస్తున్న మాట వాస్తవమే. కానీ వారు పొగిడితే పొంగిపోయి సినిమాలను మెగాస్టార్ డిజాస్టర్స్ చేసుకునే స్థితిలో అయితే లేరు. 

సోషల్ మీడియాలో భోళా శంకర్ ని ఆడియన్స్ ఏదో పగబడినట్టుగా రిజక్ట్ చేసారు, పూర్ కాంబినేషన్ కి తోడు, ప్రీ రిలీజ్ ప్రమోషన్ టాక్ షోస్ లో అన్నయ్యా అన్నయ్యా అంటూ జబర్దస్త్ కమెడియన్ ల అతి భజన చెయ్యడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వయసుకు తగని మెగాస్టార్ ప్రవర్తన,(కీర్తి సురేష్ విషయంలో చిరు చేసిన ఓవరెక్టింగ్), ఆడియో ఫ్లాప్.. ఇలా అన్ని కారణాలు కలిసి  తెలుగు సినీ చరిత్ర లోనే భోళా శంకర్ కి అతి పెద్ద ఫ్లాఫ్ వచ్చింది అంటూ ప్రచారం చేస్తున్నారు. 

మరి అందులో వాస్తవం ఉన్నా.. అన్నయ్య అన్నయ్య అని భజన చేసే వాళ్ళని మెగాస్టార్ మందలించలేరు కదా. ఇక కథలు ఎన్నుకోవడంలో ఆయన కాస్త ఎలెర్ట్ గా ఉండాల్సిన సమయం మాత్రం ఆసన్నమైంది. 

Bhola Shankar Flop - Jabardasth batch target:

Bhola Shankar Flop: Netizens targets Jabardasth batch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs