Advertisement
Google Ads BL

డబుల్ ఇస్మార్ట్.. పూరీ తర్వాతే ఎవరైనా!


తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాషింగ్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే వెంటనే అందరూ చెప్పే మాట పూరీ జగన్నాధ్. ఆయన సినిమాలు సెట్ మీద కెళ్లడం లేటవుతుందేమోగానీ.. ఒక్కసారి సెట్‌పైకి వెళితే.. ఆపడం ఎవరితరం కాదు. అలా ఉంటుంది పూరీ పనితనం. అందుకే హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా పూరిని అంతా లైక్ చేస్తారు. అతని మేకింగ్ విధానానికి రాజమౌళి వంటి వారు కూడా ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం లైగర్ దెబ్బ తిన్న పూరి.. కసితో డబుల్ ఇస్మార్ట్‌పై దృష్టి పెట్టాడు. ఈ సినిమా రీసెంట్‌గానే అనౌన్స్‌మెంట్, ఆ వెంటనే పూజా కార్యక్రమాలు.. కంటిన్యూ‌గా ఫస్ట్ షెడ్యూల్ షూట్‌ని పూరి పూర్తి చేశారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు రెండో షెడ్యూల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ తాజాగా థాయిలాండ్‌లో ప్రారంభమైనట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో హీరో రామ్, సంజయ్ దత్‌పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. రీసెంట్‌గా సంజయ్ దత్ పుట్టినరోజును పురస్కరించుకుని.. ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని మేకర్స్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ బిగ్ బుల్‌గా కనిపించబోతున్నారు. బిగ్ బుల్ లుక్ సూపర్బ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోగా.. ఇప్పుడు రామ్, సంజయ్ దత్‌లపై థాయిలాండ్‌లో చిత్రీకరించే సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అనేలా.. అప్పుడే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. ఏదైనా.. సరే ఈసారి పూరి మాత్రం మాములుగా వదిలిపెట్టడు. అసలు, వడ్డీ మొత్తం కలిపి కొట్టాలనే కసితో డబుల్ ఇస్మార్ట్‌కు వర్క్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్‌‌‌లో దర్శనమిస్తుండటం చూస్తూనే ఉన్నాం. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 8 మార్చి, 2024న మహా శివరాత్రి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

Double iSmart Second Schedule Begins In Thailand:

Double iSmart In Thailand
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs