Advertisement
Google Ads BL

OG ఫ్యాన్ మేడ్ పోస్టర్సే ఇలా ఉంటే..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్స్ అంటూ సేఫ్ జోన్‌లో సినిమాలు చేస్తుండటం ప్రేక్షకులకే కాదు.. ఆయన ఫ్యాన్స్‌లో కూడా చాలా మందికి నచ్చడం లేదు. ఎంత పొలిటికల్‌గా బిజీగా ఉన్నా.. ఇలా రీమేక్స్ కాకుండా స్ట్రయిట్ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా పోయినా కూడా స్ట్రయిట్ సినిమా కాబట్టి.. అంత ఎఫెక్ట్ అనిపించదు. కానీ రీమేక్ సినిమాలు చేసి.. డబ్బులు రాక, నిర్మాతలు ఇబ్బంది పడుతుంటే.. ఆయన చూడలేక రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయడం వంటివి పదే పదే జరుగుతుంటే.. ఆయన ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. అయితే ఇక నుంచి పవర్ స్టార్ నుంచి రాబోయే సినిమాలు మాత్రం మ్యాగ్జిమమ్ స్ట్రయిట్ సినిమాలే. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి సాహో దర్శకుడు తెరకెక్కిస్తోన్న OG, రెండోది మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్.. మూడోది క్రిష్ తెరకెక్కిస్తోన్న హరిహర వీరమల్లు. వీటిలో హరీష్ శంకర్ చేసే చిత్రం రీమేక్ అని తెలుస్తున్నా.. హరీష్ శంకర్ చేతిలో పడితే.. అది ఫ్రెష్ సబ్జెక్ట్‌లా మారిపోతుంది కాబట్టి.. ఫ్యాన్స్ ఆ సినిమా విషయంలో స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఇక హరిహర వీరమల్లు ఎప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుంటుందో తెలియదు కానీ.. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ది బిగ్గెస్ట్ హిట్ చిత్రం అయ్యే అవకాశాలే ఉన్నాయి. 

ఇవి రెండూ కాకుండా ఆయన చేస్తున్న OGపై మాత్రం ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. అది ఎంత అంటే.. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా ట్రెండ్‌ని బద్దలు కొట్టేంతగా మారిపోతున్నాయంటే.. ఆ సినిమాపై అంతా ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అందునా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అయిన సుజీత్ డైరెక్ట్ చేస్తుండటం, ఆస్కార్ విన్నింగ్ చిత్రాన్ని నిర్మించిన-మెగా ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చేసే నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండటంతో.. ఈ సినిమాతో పవర్ స్టార్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుందనేలా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.

OG Fan Made Poster Creates Sensation in Social Media:

High Expectations On Pawan Kalyan OG Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs