Advertisement
Google Ads BL

సాయి పల్లవి సేఫ్.. పాపం కీర్తి..!


అందమైన ముద్దుగుమ్మ చెల్లెలిగా చేస్తే.. ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. హీరోలతో రొమాన్స్ చేస్తూ, డ్యూయెట్స్ వేసుకుంటే చూడాలని ఉంటుంది కానీ.. సినిమా అంతా అన్నయ్యా, అన్నయ్యా అంటూ ఏడుపుగొట్టు సీన్లలో నటిస్తే.. అస్సలు తట్టుకోలేరు. ఇది కీర్తి సురేష్ విషయంలో నిజమైంది. ఒకసారి దెబ్బ తగిలినా.. మళ్లీ అదే తప్పు చేసిందీ మహానటి. అంతకు ముందు రజనీకాంత్ ‘పెద్దన్న’ సినిమాలో ఇలాగే చెల్లెలిగా కనిపిస్తే.. ఫ్యాన్స్, ప్రేక్షకులు తిప్పికొట్టారు. అయినా కూడా కీర్తి సురేష్ తెలుసుకోలేకపోయింది. బహుశా మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ కాబట్టి కాదనలేక పోయి ఉంటుంది. కానీ ఇదే ఆమెకు ఇప్పుడు శాపంగా మారింది. 

Advertisement
CJ Advs

అదేదో సామెత ఉంది కదా.. మొహమాటానికి పోతే.. అని.. అలా ఉంది ఇప్పుడు కీర్తి పరిస్థితి. ఈ విషయంలో సాయి పల్లవిని మెచ్చుకోవాలి. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా చేసే ఛాన్స్ ఫస్ట్ సాయి పల్లవికే వచ్చింది. కానీ ఆమె.. చిరు పక్కన డ్యాన్స్ చేయాలని కోరుకుంటాను కానీ.. చిరుతో చెల్లి అని పిలిపించుకోలేనంటూ సున్నితంగా ఈ ఆఫర్‌ని తిరస్కరించింది. ఈ విషయంలో కొందరు సాయి పల్లవిని విమర్శించారు కూడా. అయినా కూడా.. మొదటి నుంచి తను ఏం నమ్మిందో.. అదే సిద్ధాంతంతో ఈ ఆఫర్‌కి ఆమె నో చెప్పింది.

కానీ, కీర్తి సురేష్ మాత్రం బలైంది. అసలే, ఈ మధ్య బాగా బక్క చిక్కిపోయిన తనకి అవకాశాలు రాక అల్లాడిపోతుంటే.. ఇప్పుడు ‘భోళా’ రూపంలో పెద్ద బ్యాండే పడింది. ‘భోళా శంకర్’లో ఆమె పాత్ర బాగానే ఉంది, ఆమె కూడా చక్కగానే నటించింది.. కానీ సక్సెస్ మాత్రమే ఎప్పుడూ మాట్లాడుతుంది కాబట్టి.. ఈ సినిమాకి వస్తున్న టాక్‌తో.. సినిమాలో బాగా చేసిన వారి పేర్లు కూడా మరుగున పడిపోయాయి. మరీ ముఖ్యంగా పాపం కీర్తి.. అనే పరిస్థితి నెలకొంది. మరి నెక్ట్స్ కీర్తి సురేష్ స్టెప్ ఏంటో చూడాలి.

Sister Tag Curse to Keerthy Suresh:

Sai Pallavi Safe and Keerthy Suresh Locked 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs