తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు.. ఏ రంగంలో అయినా నిలబడాలంటే.. కష్టంతో పాటు కూసంత అదృష్టం కూడా ఉండాలి. కానీ అందం అనే పదానికి అర్థం నేనే అనేలా ఉండే కేతిక శర్మకు మాత్రం అదే కరువైంది. మొదటి సినిమా నుంచి ఆరబోత విషయంలో అడ్డు చెప్పకపోయినా, అవకాశాల కోసం రికమెండ్ చేసే వారు ఉన్నా కూడా.. కేతిక శర్మకు లక్ కలిసి రావడం లేదు. ఫలితంగా ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ.. ఆమెని బావురుమనిపించేలా చేస్తోంది. కనీసం బ్రో సినిమా అయినా.. కాస్త చెప్పుకోవడానికి, రిఫరెన్స్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుందని.. ఈ భామ ఎంతో ఆశపడింది కానీ.. అది కూడా చేతులెత్తేసింది.
రొమాంటిక్ చిత్రంతో ఆరబోతే లక్ష్యంగా అంగరంగవైభవంగా అరంగేట్రం చేసిన కేతిక శర్మ.. ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకుంది. కానీ ఏం లాభం.. హిట్టు అనే పదం ఇంకా ఆమె ఖాతాలో జమ కాలేదు. దాని కోసం తెగ ట్రై చేస్తున్నా.. ఇప్పుడామెని పట్టించుకునేవాళ్లు కూడా లేరు. ఎందుకంటే, ఏ ఇండస్ట్రీలో అయినా నిలబడాలంటే సక్సెస్ చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. మరో రెండు ఛాన్స్‌లు తెప్పిస్తుంది. ఇప్పుడు శ్రీలీల చుట్టూ ఎగబడే వారు కూడా.. రేపు ఆమెకు వరసగా నాలుగైదు సినిమాలు ఆడకపోతే.. ఆమెను కూడా నార్మల్‌గానే ట్రీట్ చేస్తారు. అయితే సక్సెస్ లేదు కదా.. అని డీలా పడకుండా.. శ్రీలీల మాదిరిగా ఎప్పుడూ యాక్టివ్‌గా కనబడాలి. తనకున్న టాలెంట్‌ని బయటపెట్టే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా.. నీరసంగా ఉంటే ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా కేతిక ఇది గమనించాలి.
ఇక తనకు వస్తున్న ఫ్లాప్స్ గురించి, తన సినిమాల రిజల్ట్ గురించి కేతిక స్పందిస్తూ.. నా సినిమాలు సరిగా ఆడలేదు కానీ.. నా ప్రయత్నంలో మాత్రం ఎటువంటి లోపం లేదు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా సక్సెస్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. నేను ఎన్నుకునే చిత్రాల విషయంలో నా నిర్ణయం తప్పుగా అనిపించవచ్చు.. కానీ ఎంపిక చేసుకున్న రోజు పూర్తి స్థాయిలో వాటిపై నాకు విశ్వాసం ఉందని మాత్రం చెప్పగలను.. అంటూ సెలవచ్చిందీ అమ్మడు.