Advertisement
Google Ads BL

6 దశాబ్దాలుగా అసమాన చక్రవర్తి..


కమల్ హాసన్ వైవిధ్యానికి మారు పేరు. ఏ పాత్ర అయినా.. అందులో పరకాయ ప్రవేశం చేసే అతి తక్కువ మంది నటులలో కమల్ హాసన్ ప్రథమ స్థానంలో ఉంటారు. ప్రేక్షకులకు ఏది కావాలంటే అది అందించేందుకు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే కెపాసిటీ కమల్ సొంతం. 63 ఏళ్ల సినీ ప్రస్థానం.. దాదాపు 230 సినిమాలు. సంఖ్యతో కొలవలేని అభిమాన జన సంద్రం.. ఇలా కమల్ గురించి చెప్పాలంటే.. చాలా ఉంది. రాసే ఓపిక ఉన్నా.. చదివే ఓపిక నేడు జనాలకి లేదు కాబట్టి.. స్ట్రయిట్‌గా పాయింట్‌లోకి వచ్చేద్దాం..

Advertisement
CJ Advs

కమల్‌ హాసన్‌ చిత్ర పరిశ్రమకు వచ్చి 63 ఏళ్లు పూర్తయింది.. ఈ సందర్భంగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కమల్ హాసన్ కుమార్తె అయిన శృతి హాసన్ కూడా తన తండ్రి సినీ కెరీర్‎పై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. శృతిహాసన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శృతి మాత్రమే కాదు.. ఆయన ఫ్యాన్స్ చాలా మంది.. కమల్ సినీ కెరీర్‌పై ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. కమల్ హాసన్ 63 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకుని 64లోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఓ ఫ్యాన్ ఎడిట్‌ చేసిన ఫోటోగ్రాఫ్‎ను శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘సినీ కెరీర్‎లో నాన్న ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశారు. ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. చిత్ర పరిశ్రమ బాగుండాలని, దాని ఎదుగుదల కోసం ఆయన నిత్యం అలుపెరుగని పోరాటం చేశారు. 6 దశాబ్దాలుగా అసమాన చక్రవర్తిగా విరజిల్లుతున్న నాన్న ఇప్పుడు సినీరంగంలో 64వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు’ అని తెలుపుతూ.. కమలిజంకు 64ఏళ్లు అనే ట్యాగ్‌ని జత చేసింది శృతిహాసన్. శృతి ట్వీట్‌‌కు లైక్స్‌, కామెంట్లతో కమల్‌పై ఉన్న అభిమానాన్ని నెటిజన్లు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోగా.. ‘కల్కి 2898 AD’లో విలన్‌గా నటిస్తున్నారు.

Shruti Haasan Tweet on Her Father Completing 63 Years In Film Industy:

Shruti Haasan Emotional Tweet on Kamal Haasan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs