Advertisement
Google Ads BL

భారీ వద్దు.. చిన్న సినిమాలు చేయండి సార్!


పాపం అనిల్ సుంకర బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలు నెత్తిన శఠగోపం పెట్టాయి. ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్‌లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు భారీ దెబ్బ తిన్నారు. అఖిల్ అక్కినేని‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఏజెంట్ ఘోరమైన ప్లాప్ అయ్యింది. సెకండ్ షో కే ఏజెంట్ అటకెక్కేసింది. ఇక ఇప్పుడు భోళా శంకరుడు కూడా అనిల్ సుంకరకి కోలుకోలేని దెబ్బ వేశాడు. 

Advertisement
CJ Advs

నిన్న శుక్రవారం విడుదలైన భోళా శంకర్ మూవీ అన్ని విధాలుగా ప్రేక్షకులని డిజప్పాయింట్ చేసింది. మరి ఈ రెండు సినిమాల మధ్యలో వచ్చిన చిన్న సినిమా సామజవరగమన మూవీ అనిల్ సుంకరని ఏజెంట్ ప్లాప్ నుండి, నష్టాల నుండి గట్టెక్కించింది. సామజవరగమన లో బడ్జెట్‌తో తెరకెక్కి భారీ లాభాలని అనిల్ సుంకర ఖాతాలో వేసింది. కానీ ఇప్పుడు భోళా శంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పుడు అట్టర్ ప్లాప్ లిస్ట్‌లోకి వెళ్లడం అనిల్ సుంకరని మరోసారి నష్టాల బాట పట్టించింది. 

దీనితో అనిల్ సుంకరని మీరు పెద్ద సినిమాలు చేయడం మానేసి చిన్న సినిమాలు తీసుకుని హ్యాపీగా డబ్బులు సంపాదించుకోండి అంటూ అనిల్ సుంకర అండ్ కో కి సలహాలు పడేస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం భోళా శంకర్ రిజల్ట్‌తో అనిల్ సుంకర మాత్రం అన్ హ్యాపీగా ఉన్నారు. ఈ వీకెండ్ కాస్త నిలబడుతుందేమో అనుకుంటే.. జైలర్ రూపంలో దెబ్బపడిపాయె..

One More Big Loss to Anil Sunkara with Bholaa Shankar:

Anil Sunkara Shocked with Agent and Bholaa Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs