Advertisement
Google Ads BL

జైలర్‌లో బాలయ్య చేయాలి.. కానీ!


సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జైలర్. గురువారం విడుదలైన ఈ చిత్రం కొంతకాలంగా రజనీకాంత్‌కి దూరమైన హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ఊచకోత మొదలైంది. జైలర్ విడుదల తర్వాత రోజు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ నెగిటావ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఈ వీకెండ్ జైలర్ కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం శనివారం, ఆదివారం బుకింగ్స్ బీభత్సంగా జరగడం చూస్తుంటే.. రజనీ మానియా మొదలైందనే చెప్పుకోవాలి. 

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలయ్య ఓ పాత్ర చేయాలని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంకాస్త ఇంట్రెస్ట్ పెట్టారు. మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులు అటు మెగా హీరో సినిమా పోవడంతో పాటు.. జైలర్‌లో బాలయ్య అనే టాక్ రావడంతో.. ఈ సినిమాని నెత్తిన పెట్టుకుంటున్నారు. బాలయ్య కోసం ఇందులో ఓ పాత్రని అనుకున్నప్పటికీ.. అది సాధ్యం కాలేదని చెబుతూ.. దర్శకుడు నెల్సన్ ఇచ్చిన వివరణ నందమూరి అభిమానులకు బాగా నచ్చేసింది. 

ఈ చిత్రంలో బాలకృష్ణగారితో నటింపజేయాలని అనుకున్నాను. ఓ పోలీసు ఆఫీసర్ పాత్రకు ఆయనను అనుకున్నాను. అయితే కథకు తగినట్లుగా క్రియేట్ చేయలేకపోయాను. అంత పవర్‌ఫుల్‌గా బాలయ్య పాత్రని డిజైన్ చేయలేకపోవడంతో.. ఆయనని సంప్రదించలేకపోయాను. కచ్చితంగా భవిష్యత్‌లో ఆయనతో సినిమా చేస్తానేమో.. అని నెల్సన్ చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. నిజంగా నెల్సన్ చెబుతున్నట్లుగా అంత పవర్ ఫుల్ పాత్రను కనుక డిజైన్ చేసి.. బాలయ్య కూడా ఇందులో నటించి ఉంటే.. అసలిప్పుడు నందమూరి అభిమానులను పట్టుకోవడం సాధ్యమయ్యేది కాదేమో.. ఎందుకంటే.. మెగాస్టార్ సినిమా పోటీ ఉంది కదా..

Nelson Dileep Kumar Talks About Balayya Role in Jailer :

Balakrishna Should have Acted in Jailer Says Rajinikanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs