Advertisement
Google Ads BL

వీటితో సరిపెట్టుకోమంటున్న సమంత


సమంత హెల్త్ సెట్ అయినా, మధ్యలో మళ్ళీ ఆమె ట్రీట్మెంట్ పై ఎన్నో రకాల వార్తలొచ్చినా.. ఆమె మాత్రం ఎక్కడ కనిపించినా హుషారుగానే ఉంటుంది. రీసెంట్ గా సినిమా షూటింగ్స్ పూర్తి చేసి బాలిలో కాస్త రిలాక్స్ మోడ్ లో కనిపించిన సమంత వర్కౌట్స్ లో మాత్రం ఇంకా కుస్తీలు పడుతూనే ఉంది. అయితే సమంత హెల్త్ రీజన్స్ వల్ల ఖుషి షూటింగ్ ఎలా చేసారో విజయ్ దేవరకొండ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పారు. ఇక సమంత అలా అలా సరదాగానే కనిపిస్తున్నా  ఖుషి ప్రమోషన్స్ కోసం రావడం లేదు. రీసెంట్ గా జరిగిన ప్యాన్ ఇండియా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా పాల్గొనలేదు. 

Advertisement
CJ Advs

దానితో సమంత ఎక్కడో బాలిలో ఎంజాయ్ చేస్తూ రోజుకో పిక్ షేర్ చేస్తుంది. కానీ ఖుషి ప్రమోషన్స్ లోకి రావడం లేదు అంటూ విమర్శలు మొదలైపోయాయి. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న ఖుషి చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యాయి. అయితే సమంత ఖుషి కి సంబందించిన ఓ కామన్ ఇంటర్వ్యూ అంటే టీంతో కలిసి చేసే ఇంటర్వ్యూ అలాగే త్వరలో జరగబోయే మ్యూజికల్ నైట్ ఈవెంట్ కి సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది. 

సమంత హెల్త్ రీజన్స్ వలనే ఆమె ఖుషి ప్రమోషన్స్ కి రావడం లేదు అని.. ఈ రెండు ప్రమోషనల్ ఈవెంట్స్ తో సరిపెట్టుకొమ్మని మేకర్స్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. అది పూర్తి కాగానే సమంత ఆరోగ్య రీత్యా అమెరికా ప్రయాణమవుతుంది అని సమాచారం. 

Samantha wants to settle with these:

Samantha attends Kushi promotional events
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs