సీనియర్ నటి జయప్రద కి చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించడం కలకలం సృష్టించింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించింది. చెన్నై కి చెందిన రాజ్ కుమార్, రాజబాబు లతో కలిసి జయప్రద చెన్నైలోని అన్నా రోడ్డులో థియేటర్ ని నడిపించేవారు. అయితే ఈ థియేటర్ లో పని చేసే కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ ఐ మొత్తాన్ని చెల్లించలేదని.. కార్మిక భీమా సంస్థ థియేటర్ యాజమాన్యంపై కేసు వేసింది.
దీనిపై ఎగ్మోర్ కోర్టు విచారం చేపట్టింది. విచారణలో భాగంగా నేడు శుక్రవారం జైలు శిక్ష తో పాటుగా.. ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. ప్రస్తుతం జయప్రదకి కోర్టు జైలు శిక్ష విధించింది అనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అయితే జయప్రద అండ్ కో వెంటనే కోర్టులో జరిమానా డబ్బులు చెల్లించి బెయిల్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.