సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ నిన్న గురువారం ఆగష్టు 10న విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ల ఎంట్రీ తో ఇదొక ప్యాన్ ఇండియా మూవీలా మారిపోయింది. భారీ అంచనాల నడుమ నిన్న ఆడియన్స్ ముందుకు వచ్చిన జైలర్ చిత్రానికి తెలుగు రాష్ట్రల్లో మిక్స్డ్ టాక్ రాగా.. తమిళంలో హిట్ టాక్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రజినీ జైలర్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. జైలర్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందో చూసేద్దాం..
TN - ₹ 29.46 cr
AP/TS - ₹ 12.04 cr
KA - ₹ 11.92 cr
KL - ₹ 5.38 cr
ROI - ₹ 4.23 cr
OS - ₹ 32.75 cr [Reported Locs]
Total - ₹ 95.78cr