మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ నేడు ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భోళా శంకరుడిగా మెగాస్టార్ లుక్స్, సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్ర ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మరి మెగా అభిమానులు ఆగుతారా.. సోషల్ మీడియాలో భోళా శంకర్ టాక్ ని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. కొందరు సూపర్ అంటే.. కొందరు యావరేజ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి మనము ఓసారి ఓవర్సీస్ టాక్ ఎలా ఉందొ చూసేద్దాం..
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టేకాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అయ్యింది, చిరంజీవి పవర్‌ఫుల్‌గా రివెంజ్ మోడ్‌లో కనిపించారు. చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది అని ఒకరంటే.. మరొకరి మెగాస్టార్ లుక్స్, ఆయన యాక్టింగ్ సిల్లీగా ఉన్నాయనేస్తున్నారు. భోళా శంకర్ సినిమా చూశాను. ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన కథ.. ఫస్ట్ హాఫ్ వీక్ అయినా.. సెకండాఫ్ చాలా బాగుంది. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ వర్క్ అయింది. క్లైమాక్స్ ఫైట్‌లో అయితే చిరంజీవి ఇరుగదీశాడు అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేసాడు.
కథలోని సమస్య చుట్టే సినిమా తిరుగుతుంది. కానీ ఈ చిత్రంలో హైలెట్ అవ్వాల్సిన ఎమోషన్స్ మిస్ అయ్యాయి. పాతతరం స్క్రీన్ ప్లే, డైరెక్షన్. మ్యూజిక్ అంతగా బాగాలేదు అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు అని ఓ నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భోళా శంకర్ కమర్షియల్ మూవీ. కొన్ని కామెడీ సీన్లు, యాక్షన్ బ్లాక్‌లు బాగున్నాయి. మిగితా విషయాలకు వస్తే పెద్దగా వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ పేలవంగా ఉంది. సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది.
70s కథ.. 80s డైరెక్షన్ అంటే అవుట్ డేటేడ్ డైరెక్షన్, జీరో హై మూమెంట్స్, సాంగ్స్ ప్లేస్‌మెంట్ అస్సలు బాగాలేవు. కామెడీ సీన్లు అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ బాగాలేదు. 2010లో తీసినట్టుగా స్క్రీన్ ప్లే ఉంటుంది.. అంటూ మరికొందరు భోళా పై తమ ఒపీనియన్ ని తెలియజేస్తున్నారు.