పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ముగ్గురు పిల్లలు అంటూ వైసీపీ నేతలు మాత్రమే కాదు గౌరవ ప్రదమైన పదవిలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంటి వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం తాను ఎప్పటికి తన మాజీ భర్తకి సపోర్ట్ అంటూ ఓ వీడియో ద్వారా ప్రకటించింది. రేణు దేశాయ్ ఇన్స్టా లో వదిలిన ఓ వీడియో ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది. తాను డే 1 నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాలకి సపోర్ట్ గానే ఉన్నాను, నేను నా జీవితంలో ముందుకు సాగిపోతున్నాను, పవన్ కళ్యాణ్ అందరిలాంటి వాడు కాదు.. ఆయన అరుదైన వ్యక్తి. ఆయన సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలనుకుంటున్నారు.
పవన్ మనీ మైండెడ్ కాదు. డబ్బు పై ఎలాంటి ఆసక్తి లేదు. సమాజం కోసం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు. ఆయనకు పొలిటికల్ గా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటా. రాజకీయంగా ఆయనకి మద్దతునివ్వండి. ఆయన చేస్తున్న సేవలని గుర్తించండి. ఆయనొక సక్సెస్ఫుల్ నటుడు. ప్రజలకి సేవ చెయ్యాలని ఆయన ఫ్యామిలీని పక్కనబెట్టి పాలిటిక్స్ లోకి వచ్చారు. దయచేసి ఓ అవకాశం ఇవ్వండి. అంతేకాని.. ప్రతిసారి ఆయన పర్సనల్ లైఫ్ ని మధ్యలోకి లాగొద్దు. పవన్ మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపెయ్యండి, నాపిల్లలే కాదు మిగతా ఇద్దరు పిల్లలను ఈ విషయాల్లోకి లాగకండి, ఎందుకంటే వారు చిన్నపిల్లలు అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో మనవి చేసింది.
అంతేకాకుండా ఆమె బ్రో లోని శ్యాంబాబు వివాదంపై కూడా స్పందించింది. ఈ మధ్యనే విడుదలైన ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దరి తీశాయని తెలిసింది. ఆ వివాదంపై నాకు అవగాహన లేదు. కాకపోతే కొంతమంది పవన్ వ్యక్తిగత జీవితంపై వెబ్ సీరీస్ చేస్తామని అందులో ఆయన మూడు పెళ్లిళ్లు, భార్యలు, వ్యక్తిగత జీవితం ఉంటుంది అన్నారు. ఒక తల్లినా నేను వ్యక్తిగతంగా అభ్యర్దిస్తున్నాను, దయచేసి పిల్లలని ఇందులోకి లాగకండి.. అందుకే ఈ వీడియో చేస్తున్నాను అంటూ రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉంటాను, ఉన్నాను అని కుండా బద్దలు కొట్టింది.