Advertisement
Google Ads BL

పవన్ బర్త్ డేకి బోలెడన్ని సర్ ప్రైజ్ లు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఇంకా దాదాపుగా 20 డేస్ టైం ఉంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే సోషల్ మీడియా షేకే. ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్ డేట్స్ ఒక వైపు.. ఆయనకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖుల ట్వీట్స్ మరొక వైపు. పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే హడావిడి అబ్బో మాములుగా ఉండదు వ్యవహారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG నుండి సెప్టెంబర్ 2 న సర్ ప్రైజ్ ఇస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చేవారు. 

Advertisement
CJ Advs

దానయ్య ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి Get ready to face the HEAT WAVE!! 🔥🔥🔥 #FireStormIsComing on September 2nd. 🤙🏻🤙🏻🤙🏻 #OG fans, brace yourselves… అంటూ అప్ డేట్ రావడంతో పవన్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి  కూడా పవన్ ఫాన్స్ కి ట్రీట్ వస్తుంది అని తెలుస్తుంది. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ హరీష్ ని అమరావతికి పిలిచి ఉస్తాద్ భగత్ సింగ్ కి  డేట్స్ కూడా కేటాయించారని అంటున్నారు.

ఆగష్టు 3 వ వారం నుండి ఉస్తాద్ భాగహాత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ నుండి కూడా పవన్ బర్త్ డే కి సర్ ప్రైజ్ రెడీ అవుతోంది.. అది పక్కానే. అటు వీరమల్లు నుండి ఓ పోస్టర్ రావడం జరుగుతుంది. మరి ఇన్ని సర్ ప్రైజ్ లతో పవన్ ఫాన్స్ సెప్టెంబర్ 2 న ఉక్కిరిబిక్కిరైపోతారేమో!

Lots of surprises for Pawan birthday:

OG Fire Storm Is Coming on September 2nd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs