మెగాస్టార్ Mega 150 తో తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 తో హిట్ కొట్టిన మెగాస్టార్ ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూ పోతున్నారు. వీలయితే ఏడాదికి రెండు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో ఎక్కువగా రీమేక్స్ ఉన్నా అవి వర్కౌట్ అవడంతో మెగాస్టార్ చిరు రీమేక్స్ చెయ్యడానికి వెనుకాడడం లేదు.
రేపు శుక్రవారం భోళా శంకర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి మూవీని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చెయ్యబోతున్నారు. దానిపై ప్రకటన ఆయన బర్త్ డే అంటే ఆగష్టు 22 న రాబోతుంది. ఆ తర్వాత మెగాస్టార్ మూవీ కూడా ఆల్మోస్ట్ ఓకె అయ్యింది. అది బింబిసార దర్శకుడు మల్లాది వసిష్ఠ తో మెగాస్టార్ Mega 157 కి గ్రీన్ సింగ్నల్ ఇచ్చేసారు. బింబిసార తో బ్లాక్ బస్టర్ అందుకున్న వసిష్ఠ.. తర్వాత బింబిసార 2 చెయ్యాల్సి ఉంది.
అయితే ఆయన ఇప్పుడు మెగా స్టార్ చిరుని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. నిన్నమొన్నటివరకు అది ప్రచారమే కానీ ఇప్పుడు అది అధికారమే అయినా.. అఫీషియల్ ప్రకటన మాత్రమే బ్యాలెన్స్. ఈ చిత్రం కూడా వసిష్ఠ సోశియే ఫ్యాన్టసి బ్యాగ్డ్రాప్ లోనే తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు అని తెలుస్తోంది. అయితే చిత్రాన్ని UV క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా.. నవంబర్ లో Mega 157 ని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.