అసలు మెగాస్టార్ మాట్లాడిందేమిటి.. వైసీపీ నేతలు చేసిన విమర్శలేమిటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య ఈవెంట్ లో.. please సినిమాపరిశ్రమని బతకనివ్వండి.. వీలైతే చేయూత నివ్వండి అని చేసిన మనవి పూర్తిగా అర్ధం చేసుకోకుండా social media లో చక్కర్లు కొట్టిన కొన్ని వార్తల ఆధారంగా, కొంత మంది రాజకీయ నాయకులు మెగాస్టార్ చెప్పిన విషయాన్ని అపార్ధం చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
సినీపరిశ్రమ మేలు కోరే వ్యక్తి గా ఆయన చేసిన సూచన, విన్నపం పూర్తిగా ఈ video లో ఉంది. ఈ అభ్యర్ధన లో తప్పు ఏముంది ? దానికి ఎందుకింత రాధ్ధాంతం? అంటూ మెగాస్టార్ పర్సనల్ టీం మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య ఈవెంట్ లో చిరు మాట్లాడిన వీడియోని వదిలింది. అందులో చిరు ఏపీ ప్రభుత్వం పై ఎలాంటి విమర్శలు చెయ్యలేదు. మరి ఇది చూసాక వైసీపీ బ్యాచ్ బకరాలైనట్టేగా..
లేదంటే నిన్నటి నుండి మీడియా ముందు చిరు అలాగా.. సినిమా ఇండస్ట్రీ ఇలాగా అంటూ నానా మాటలంటూ మెగా ఫాన్స్ కి మంటెక్కించారు. కొడాలి నాని అయితే నోటికొచ్చినట్టుగా సినిమావాళ్ళు పకోడీ గాళ్ళంటూ రెచ్చిపోయాడు. ఇక రోజమ్మ అయితే మెగాస్టార్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసాడు, హీరోలతో కలిసి జగన్ గారి దగ్గరకొచ్చి టికెట్ రేట్లు పెంచమని ఏ అర్హతతో అడిగారు అంటే..పేర్ని అన్ని అయితే గిల్లితే గించుకుంటామా మేము గిల్లుతామంటూ.. ఇలా మెగాస్టార్ పై చిందులు తొక్కారు.
తమ ప్రభుత్వాన్ని మెగాస్టార్ అవమానించారంటూ ఏపీ మంత్రులు, నేతలు ఒకరి మీద ఒకరు మెగాస్టార్ పై పడిపోయారు. మరి చిరు మాట్లాడిన అసలు వీడియో చూసాక వైసీపీ నేతలు, వాళ్ళ కార్యకర్తలు,అభిమానులు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో అంటూ మెగా అభిమానులు సెటైర్స్ వేస్తున్నారు.