సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే టు డే. బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయనకున్న అపారమైన అభిమానులు. రెండు తెలుగు స్టేట్స్ లో కలిపి 350 థియేటర్స్ లో రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ కలెక్షన్స్ లో మహేష్ మ్యానియా చూపిస్తుంది. హైదరాబాద్ మెయిన్ సెంటర్ సుదర్శన్ 35, దేవి 70MM, సంధ్య 70MM , శాంతి 70MM ,తారకరామా 70 MM అన్ని థియేటర్స్ ని హౌస్ ఫుల్ చేసేసింది మహేష్ మ్యాజిక్.
మహేష్ బాబు హైదరాబాద్ లో లేరు. వెకేషన్ లో ఉన్నారు అనేది అందరికి తెలిసిందే. ఇవన్నీ జస్ట్ ఫాన్స్ సెలెబ్రేషన్స్. గుంటూరు కారం సినిమా నుంచి ఏదో అద్భుతమైన అప్ డేట్ వస్తుంది అని గంపెడంత ఆశతో ఎదురు చూసిన అభిమానులకి బీడీ, లుంగీ లుక్ ఇచ్చి సరిపెట్టేసారు త్రివిక్రమ్. అయినా సోషల్ మీడియా అంతటా తమ అభిమాన హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సూపర్ స్టార్ అభిమానులు సూపర్బ్ గా రెచ్చిపోతుంటే అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చి పడ్డాయి రెండు అవాంతరాలు.
అవేంటంటే.. ఎలాంటి ఎనౌన్సమెంట్ లేకుండా ఎన్టీఆర్ న్యూ లుక్ వచ్చేసింది. ఒక్కసారిగా తారక్ ఫాన్స్ లో తాండవం మొదలైంది. ఓ వైపు అదే సోషల్ మీడియాని ఊపేస్తుంటే.. మరోవైపు బావ కి ధీటుగా బావమరిది ఎంట్రీ ఇచ్చాడు. పుష్ప రాజ్ కొత్త ఫోజులు సడన్ గా సోషల్ మీడియాలోకి వచ్చేసాయి. దీనితో చాలా పెద్ద ట్రెండ్ క్రియేట్ చేద్దామనుకున్న మహేష్ ఫాన్స్ కి కళ్ళు చెదిరిపోయాయి, కాళ్ళు తడబడుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముగ్గురు టాప్ స్టార్స్ ఒకేరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం బహుశా ఇదే మొదటిసారేమో.. ఇది వాంటెడ్ గా చేసిందేమో అని కొందరు అనుమానిస్తున్నారు. ఆ కామెంట్ ని మహేష్ ఎలా తీసుకుంటారో చూడాలి.
ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో, స్ట్రెంత్ ఏమిటో, స్టామినా ఏమిటో సెప్టెంబర్ 2 న మళ్ళీ చూస్తారు, గబ్బర్ రీ రిలీజ్ అంటూ బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్, దానికి హరీష్ శంకర్ ఇచ్చిన రిప్లై బాగా వైరలవుతున్నాయి. చూద్దాం ఈరోజు బిజినెస్ మ్యాన్ కలెక్షన్ ఎంతో.. రేపటి రోజు దానిని దాటడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే ప్రయత్నమెంతో..!