మహేష్ ఫాన్స్ కి ట్రీట్ ఇస్తారు.. గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ రెడీ అవుతుంది.. మహేష్ బర్త్ డే ఆగష్టు 9 న సోషల్ మీడియా షేకే.. అబ్బో ఇలాంటి ప్రచారం చాలానే విన్నాం. మహేష్ బాబు కూడా హైదరాబాద్ లో లేరు.. ఇక్కడ మాత్రం అభిమానులకి ఫుల్ మీల్స్ సిద్దమవుతుంది అంటూ ఇలా చాలానే అన్నారు. కానీ చివరికి మేకర్స్ ఏం చేసారు.. మహేష్ బాబు గుంటూరు కారం లుంగీ లుక్ వదిలి చేతులు దులుపుకున్నారు.
మహేష్ బాబు లుంగీలో మాస్ గా కనిపించారు. నోటిలో బీడీతో మరింత కొత్తగా కనిపించారు. కానీ మహేష్ ఫాన్స్ ఆ లుక్ తో సరిపెట్టుకోలేకపోతున్నారు. గుంటూరు కారం నుండి మహేష్ బర్త్ డే కి బోలెడంత ఎక్స్పెక్ట్ చేసారు. కానీ.. త్రివిక్రమ్ జస్ట్ ఓ లుక్ తోనే సరిపెట్టేసారు. దానితో అభిమానులు డిస్పాయింట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఏడాది కాలంగా ఎదురు చూస్తుంటే దీనితో సరిపెడతారా అంటూ గుంటూరు కారం మేకర్స్ పై మహేష్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.