కరోనా తర్వాత సెలబ్రిటీస్ నుండి సామాన్య ప్రజల వరకు హార్ట్ ఎటాక్ తో ఎప్పుడు కన్ను మూస్తున్నారో చెప్పలేకుండా పరిస్థితి తయారైంది. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడమే కాదు.. బాలీవుడ్ లోను, టాలీవుడ్ లోను ఈ రకమయిన మరణాలు, అటు రాజకీయ నాయకులు కూడా చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం తరచూ వింటున్నాం, చూస్తున్నాం, జిమ్ చేస్తూ 30 ఏళ్ళ యువకుడు మృతి, హార్ట్ ఎటాక్ తో 40 ఏళ్ల వ్యక్తి మృతి ఇలాంటి వార్తలు ఎక్కువగా చూస్తున్నాం.
నిన్న సోమవారం మలయాళ చిత్ర దర్శకుడు సిద్ధిఖీ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆయన కండీషన్ క్రిటికల్ గా ఉండగానే కుటుంభ సంభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన ఆరోగ్యంపరిస్థితి విషమించి కన్ను మూసారు. సిద్ధిఖీ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్ని డైరెక్ట్ చేసిన ఆయన పలు సినిమాల్లో నటించారు కూడా.
తెలుగులో హీరో నితిన్ తో మారో సినిమా చేసారు. కొచ్చిలోని ఆసుపత్రిలో నిన్నటినుండి చికిత్స పొందుతూ ఈరోజు మంగళవారం ఆయన తుది స్వాస విడిచారు. సిద్ధిఖీ మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మలయాళ చిత్ర పరిశ్రమ మంచి దర్శకుడిని కోల్పోయినట్లుగా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.