విజయ్ దేవరకొండ - సమంత కాంబోలో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి మూవీ ప్రమోషనల్ పోస్టర్స్, సాంగ్స్ అన్ని రొమాంటిక్ గా కనిపిస్తున్నాయి. ఆరాధ్య సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ సాంగ్ లో విజయ్ దేవరకొండ-సమంత కెమిస్ట్రీకి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు.
దానికి సంబందించిన పోస్టర్ లో విజయ్-సమంత మధ్యలో అద్భుతమైన రొమాంటిక్ యాంగిల్ కనిపించింది. పక్కనే కుక్కపిల్ల ఉండగా.. వీరిద్దరూ రొమాంటిక్ ఫోజు లు ఇస్తూ చూడముచ్చటైన జంట అనేలా ఉన్నారు. సినిమాలో వీరి రొమాన్స్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఖుషి ట్రైలర్ పై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.