మెగా బ్రదర్స్ ముగ్గురూ ఎలాంటి వారో, వారి మనస్థత్వాలు ఎలా ఉంటాయో చెప్పుకొచ్చారు హైపర్ ఆది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీపై ట్రోల్ చేసే వారందరీ చెమడాలు వలిచేశాడు. ముఖ్యంగా మెగా బ్రదర్స్‌ని కామెంట్స్ చేసే ఒక్కొక్కడికి కుర్చీ మడతెట్టి.. అంటూ ఆయన ఇచ్చిన ప్రసంగం.. ఇప్పుడు వైరల్ అవుతోంది.
* ఎంత చెప్పినా మారని కొంత మందికి మళ్లీ మళ్లీ చెబుతున్నాను. కొణిదెల వెంకట్రావుగారికి ముగ్గురు కొడుకులు. ఒకరు కొణిదెల శివశంకర వర ప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవిగారు. అభిమానులను ప్రేమిస్తాడు.. శత్రువులని సైతం క్షమిస్తాడు. రెండు కొణిదెల నాగేంద్రబాబుగారు. చాలా మంది చిరంజీవిగారితో, పవన్ కళ్యాణ్‌గారితో పోల్చి నాగబాబుగారిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వాళ్లకి చెబుతున్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిగారి వల్ల ఎంతమంది అయితే ఎదిగారో.. టీవీ ఇండస్ట్రీలో నాగబాబుగారి వల్ల మాలాంటి వారెంతోమంది ఎదిగారు. అన్నదమ్ములిద్దరి కోసం అడ్డంగా నిలబడిపోతాడు.. అలాంటి వ్యక్తి నాగబాబుగారు. ఇక మూడోవాడు కొణిదెల పవన్ కళ్యాణ్‌గారు. అందరి లెక్క తేలుస్తాడు.. అనుకున్నది సాధిస్తాడు. ఇది షూర్.
అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు.. తమ్ముడు మొండోడు.. ముంచటాలుండవ్.. తాడో పేడో తెంచటాలే. ఇది షూర్ రాసి పెట్టుకోండి. ఈ ముగ్గురు డబ్బు మీద ఆశలేని వ్యక్తులు. మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల గురించి తప్పుడు రాతలు రాసినా.. తప్పుడు కూతలు కూసినా.. కుర్చీ మడతపెట్టి.. ఇది కింది స్థాయి వారికి అర్థం కాదు.. మినిమం డిగ్రీ చేసుండాలి. అది జరుగుతుందన్నమాట.. అని హైపర్ ఆది ఫైర్ అయ్యాడు.