Advertisement
Google Ads BL

తమిళ్ లో మృణాల్ కి బంపరాఫర్


సీతారామం తో ప్యాన్ ఇండియాలోని పలు భాషల ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసింది మృణాల్ ఠాకూర్. సీత గా అందరి మనసులని తాకిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత గ్లామర్ షోకి తెరలేపింది. క్యూట్ గా, సాంప్రదాయ పద్దతిలో కనబడిన మృణాల్ ఇప్పుడు గ్లామర్ రోల్స్ కి రెడీ అయ్యింది. ప్రస్తుతం సౌత్ లో నాని తో హాయ్ నాన్నా మూవీ తో పాటుగా.. విజయ్ దేవరకొండ తో VD12 లో కనిపించబోతుంది. 

Advertisement
CJ Advs

అంతేకాకుండా రామ్ చరణ్ తో బుచ్చి బాబు మూవీ లో రొమాన్స్ చేసే అవకాశం ఉంది అనే న్యూస్ చక్కర్లు కొడుతున్న సమయంలోనే మృణాల్ కి తమిళనాట బంపర్ ఆఫర్ తగిలింది అని తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్ మురుగుదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అని తెలుస్తోంది. 

లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ కమల్ హాసన్ నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీలో సాయి పల్లవితో జోడి కడుతున్నాడు. ఈ మూవీ తర్వాతే మురుగదాస్ మూవీ మొదలు కాబోతుంది అని తెలుస్తోంది. 

Bumper offer to Mrunal Thakur in Tamil:

Mrunal Thakur to make Tamil debut with AR Murugadoss movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs