Advertisement
Google Ads BL

అప్పుడు మెగా ఫాన్స్ - ఇప్పుడు అల్లు ఫాన్స్


తమకి కావల్సిన అప్ డేట్ అందకపోతే ఆయా నిర్మాతలపై స్టార్ హీరోల అభిమానులు ఏ విధంగా ఎక్కేస్తున్నారో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా అప్పటినుండి చూస్తున్నాము. యువి క్రియేషన్స్ వారు రాధేశ్యామ్ అప్ డేట్ ఇవ్వడంలేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఆ నిర్మాణ సంస్థని తిట్టిపోశారు. ఆ తర్వాత చాలామంది స్టార్స్ ఇదే ట్రెండ్ స్టార్ట్ చేసారు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు మెగా హీరోలైన రామ్ చరణ్ కి మెగా ఫాన్స్, అల్లు అర్జున్ కి అల్లు ఫాన్స్ చుక్కలు చూపిస్తున్నారు. ఆ హీరోలతో సినిమాలు చేసే నిర్మాణ సంస్థల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. రామ్ చరణ్ గేమ్ చెంజర్ కి సంబందించిన రిలీజ్ డేట్ కోసం మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు. శంకర్, దిల్ రాజు లకి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చుక్కలు చూపించినా దర్శకనిర్మాతలు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. అసలు ఆ సినిమా అప్ డేట్ కూడా ఇవ్వకుండా కామ్ అయ్యారు. 

ఇక ఇప్పుడు అల్లు అభిమానులు కూడా పుష్ప 2 రిలీజ్ డేట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ అది రాకపోయేసరికి పుష్ప అప్ డేట్ కావాలని సోషల్ మీడియాలో యుద్దానికి దిగారు. మైత్రి మూవీ మేకర్స్ ని చెడుగుడు ఆడుతున్నారు. గత రెండు రోజులుగా అల్లు ఫాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు. మొన్న మెగా ఫాన్స్ ఇప్పుడు అల్లు ఫాన్స్ చరణ్, బన్నీ సినిమాల అప్ డేట్స్ కోసం ఇలా రచ్చకి దిగారు. 

Then Mega Fans - Now Allu Fans:

Wake Up Team Pushpa: Allu Arjun fans warning
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs