Advertisement
Google Ads BL

జాన్వీ కపూర్ డ్రీమ్ హీరో ఎవరో తెలుసా?


శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సక్సెస్ ని వెతుక్కుంటుంది. వరస ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. కానీ పాపకి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బ్రేక్ ఇచ్చే సినిమా దక్కలేదు. నటనకు ప్రాధాన్యమున్న కేరెక్టర్స్ లో కనిపించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర మూవీతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం హిందీ లో అలాగే సౌత్ లో దేవర ప్రాజెక్ట్ లో కనిపిస్తున్న జాన్వీ కపూర్ కి ఓ స్టార్ హీరో సరసన నటించాలనే కోరిక ఉందట. ఈమధ్యనే ఆ కోరికని బయటపెట్టింది. 

Advertisement
CJ Advs

ఎప్పటినుండో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఉండేదని చెప్పిన జాన్వీ కపూర్ దేవరతో ఇప్పుడు ఆ కోరిక తీరబోతోందని చెప్పింది. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్‌ కపూర్‌తోనూ స్క్రీన్‌ షేర్ చేసుకోవాలన్న కల ఎప్పటి నుంచో ఉంది, తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే రణబీర్‌కు అభిమానిని చెప్పిన జాన్వీ ఈ సంభాషణలోనే రణబీర్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకోబోతున్నానని హింట్ ఇచ్చింది. 

బాలీవుడ్ లో కెరీర్‌ మొదలు పెట్టిన కొత్తల్లోనే చాలా మంది గ్రేట్‌ డైరెక్టర్స్‌తో వర్క్‌ చేసే ఛాన్స్ రావటం తనకి చాలా ఆనందంగా ఉందన్న జాన్వీ.. ఇంకా తను వర్క్ చేయాలనుకుంటున్న దర్శకుల లిస్ట్‌ కూడా భారీగా ఉంది అని చెబుతుంది. సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్‌ సినిమాల్లో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. 

Do you know who is Janhvi Kapoor dream hero?:

Janhvi Kapoors Bollywood Dreams 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs