Advertisement
Google Ads BL

చప్పుడు లేని గుంటూరు కారం టీమ్


ఆగష్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు. మహేష్ ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ గుంటూరు కారం నుండి ఎలాంటి ట్రీట్ ఇస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం నుండి థమన్ మ్యూజిక్ లో ఫస్ట్ సింగిల్ మహేష్ బర్త్ డే కి వదలబోతున్నారనే టాక్ ఉంది. ఆ విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.  

Advertisement
CJ Advs

మహేష్ బర్త్ డే కి ఇంకా రెండుమూడు రోజులు మాత్రమే సమయం ఉంది. మహేష్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో గుంటూరు కారం అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. అటు గుంటూరు కారం మేకర్స్ కూడా ఫాన్స్ లో ఎలాంటి క్యూరియాసిటీ కలిగించే ఎర్పాట్లు ఇంకా మొదలు పెట్టలేదు. ఇంత లైట్ గా మహేష్ బర్త్ డే వేడుకలకి దగ్గరవడం అటు ఫాన్స్ కి ఇబ్బందిగానే ఉంది. గుంటూరు కారం నుండి ఖచ్చితంగా అప్ డేట్ అయితే ఉంటుంది. అది ఏమిటనేది మేకర్స్ చెబితే బావుంటుంది. 

మరోపక్క మహేష్ తనకేమి సంబంధం లేదు అన్నట్టుగా ఫ్యామిలీతో కలిసి స్కాట్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి  ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో మహేష్ తన పుట్టిన రోజు వేడుకలని జరుపుకోబోతున్నారు. 

Guntur Karam team without any noise:

Guntur Karam treat on Mahesh Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs