Advertisement
Google Ads BL

కన్నీళ్లు పెట్టుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్


బాలీవుడ్ మాజీ హీరోయిన్ బిపాసా బసు కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటుంది. హిందీ నటుడు కరణ్ సింగ్ ని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్న బిపాసాకి ఓ పాప. బిపాసా-కరణ్ సింగ్ లు తమ పాపకి దేవి గా నామకరణం చేసారు. అయితే బిపాస తమ పాప ఆరోగ్యం గురించి మట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. బిపాసా ఓ వీడియో ద్వారా పాప అనారోగ్య సమస్యలను బయటపెట్టింది. పాప పుట్టిన తర్వాత పాప గుండెలో రంద్రాలు ఉన్నాయట. 

Advertisement
CJ Advs

పాపకి మూడు నెలల వయసులోనే ఆపరేషన్ చేయించామని, మా ప్రయాణం అందరి పేరెంట్స్ మాదిరి కాదు. ఏ తల్లి ఇలాంటి కష్టం పడకూడదు. ఏ అమ్మకి ఇలాంటి సమస్య ఎదురవ్వకూడదు. పాప గుండెలో రంద్రాలు ఉన్న విషయం పాప పుట్టిన మూడో రోజే తెలిసింది. ఆ సమయంలో మేము చాలా కఠిన పరిస్థితులని ఎదుర్కొన్నాము. ఈ విషయాన్ని ఫ్యామిలీతో చెప్పకుండా మాలో మేమె కుమిలిపోయాము. ప్రతిసారి స్కానింగ్ చేయిస్తూ తెలిసిన డాక్టర్స్ తో ఆపరేషన్ చేయించాము. 

ఆ విషయంలో నేను ధైర్యంగానే స్టెప్ వేసినా.. కరణ్ చాలా కంగారు పడ్డాడు. దేవి పాపకి ఆరు గంటల పాటు సర్జరీ చేసి డాక్టర్స్ పాపని కాపాడారు. పాపకి ఆపరేషాన్ అయ్యాక దాదాపుగా 40 డేస్ నేను నిద్ర పోలేదు. ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు అనుకున్నాను. నా విషయంలో ఎంతోమంది తల్లులు హెల్ప్ చేసారు. వారందరికీ కృతజ్ఞతలు అంటూ బిపాసా ఆ వీడియోలో పాప విషయం చెప్పి కన్నీటిపర్యంతమైంది. 

Bipasha breaks down as she shares daughter Devi:

Bipasha Basu breaks down as she shares daughter Devi video
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs