కింగ్ నాగార్జున గత ఏడెనిమిది నెలలుగా కొత్త సినిమా అనౌన్స్ చెయ్యకుండా అక్కినేని అభిమానులని చాలా వెయిట్ చేయిస్తున్నారు. అయితే ఈ నెలలోనే నాగార్జున కొత్త సినిమా అనౌన్సమెంట్ రాబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా నాగార్జున బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్ర ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో నాగర్జున లుక్ కొత్తగా కనిపించింది.
ఈ ఈవెంట్ లో నాగార్జున మట్లాడుతూ.. తన భార్య అమల, అఖిల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. అమల అఖిల్ ని ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు తాను సినిమాల నుండి ఆరునెలలు దూరంగా ఉన్నాను అని, ఆ టైం లో తాను అమలనే అంటిపెట్టుకుని ఉన్నానంటూ చెప్పారు. హలొ బ్రదర్ షూటింగ్ చేస్తున్నపుడు అమల ప్రెగ్నెంట్. ఆ షూటింగ్ కంప్లీట్ చేసి అమలతో పాటుగా ఆరు నెలలు సమయం గడిపాను.
అమల డెలివరీ సమయంలోను తన చెయ్యి పట్టుకునే ఉన్నాను. ఏ సినిమా చెయ్యలేదు. ఆ ఆరు నెలల సమయం నాకెంతో ఇష్టమైనది. నిజంగా మనిషి పుట్టుక అనేది అద్భుతమే.. అంటూ అప్పట్లో నాగార్జున సినిమాలకి ఆరు నెలలు బ్రేకిచ్చిన విషయాన్ని ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ఈవెంట్ లో రివీల్ చేసారు.