మహేష్ బాబు తన ఫ్యామిలీతో రెండు వారాల క్రితమే లండన్ వెళ్లారు. లండన్ లో మహేష్ బాబు తన బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. ఆగష్టు 9న మహేష్ పుటిన రోజుని ఫ్యామిలీతో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. అక్కడ వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో.. సితార, గౌతమ్ లు ఎలా సరదాగా గడుపుతున్నారో అనేది నమ్రత ఎప్పటికప్పుడు ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా మహేష్ ఫ్యామిలీ స్కాట్లాండ్ లోని అతి పురాతనమైన రాయల్ స్కాట్స్ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించి అక్కడ సరదాగా ఫొటోస్ దిగారు. సితార, మహేష్, గౌతమ్, నమ్రతలు సెల్ఫీలకు, ఫొటోలకి ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఇక మహేష్ పుట్టిన రోజుకి గుంటూరు కారం నుండి ఓ స్పెషల్ ట్రీట్ ని త్రివిక్రమ్ సిద్ధం చేసారు. థమన్ మ్యూజిక్ నుండి ఫస్ట్ సింగిల్ ని సూపర్ స్టార్ బర్త్ డే కి వదిలి ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు.