ఈమధ్యన లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న స్పీడు మాములుగా లేదు. బాలీవుడ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఇటు సౌత్ మూవీస్ లోను బిజీగా కనిపిస్తున్న రష్మిక ప్రస్తుతం పుష్ప 2 ప్యాన్ ఇండియా షూటింగ్ తో పాటుగా.. రెయిన్ బో లాంటి బైలింగువల్ మూవీ షూటింగ్ చేస్తుంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ తో యానిమల్ షూట్ కంప్లీట్ చేసేసింది. అది డిసెంబర్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ తో కలిసి మీడియా ముందుకు వస్తున్న రశ్మికకి హిందీలో లక్కీ ఛాన్స్ తగిలింది.
అదే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ తో కలిసి నటించే అవకాశం పట్టేసింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్ తో కలిసి ఆమె తొలిసారిగా జత కట్టబోతుంది. అయితే రష్మిక-షారుఖ్ కలిసి నటించేది సినిమా కోసం కాదు వారిద్దరూ కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించనున్న ఓ కమర్షియల్ యాడ్ కోసం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట.
ప్రస్తుతం షారుఖ్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. పఠాన్ తో బాక్సాఫీసుని షేక్ చేసిన ఆయన సెప్టెంబర్ లో జవాను తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. జవాన్ సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా విడుదల కానుంది.