Advertisement
Google Ads BL

ఫైనల్ గా బ్రో వివాదంపై పవన్ రియాక్షన్


బ్రో చిత్రం విడుదలైనప్పటినుండి వైసీపీ నేత అంబటి రాంబాబు తన కేరెక్టర్ ని డ్యామేజ్ చేస్తూ ఆ చిత్రంలో శ్యాంబాబు పాత్ర పెట్టారంటూ నెత్తీనోరుకొట్టుకుంటున్నారు. ఆ చిత్రం విడుదల కాగానే సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ గుప్పిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా మీడియా మీట్ పెడుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అంబటి రాంబాబు కి బ్రో నిర్మాత టిజి విశ్వప్రసాద్ మధ్యన మాట యుద్ధం నెడుతుంది. మధ్యలో నటుడు పృథ్వీ.. అంబటి ఎమన్నా ఆస్కార్ నటుడా ఆయనని అనుకరించడానికి అంటూ కౌంటర్ ఎటాక్ చేసాడు. 

Advertisement
CJ Advs

అయితే ఇంత జరిగినా పవన్ కళ్యాణ్ బ్రో వివాదంపై స్పందించలేదు. ఆయన బ్రో విడుదల కాగానే మంగళగిరి వెళ్ళిపోయి మళ్ళీ జనసేన పార్టీ కార్యకలాపాల్లో మునిగిపోయారు. అయితే ఆయన తాజాగా బ్రో వివాదంపై స్పందించారు. నేను నటించిన బ్రో సినిమాను ఎప్పుడో వదిలేశాను. సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను, ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పాను. బ్రో సినిమా ప్రమోషన్స్ కోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన తర్వాత దానిని వదిలేశాను. కానీ వైసీపీ నాయకులు మాత్రం బ్రో ని ఇంకా వదల్లేదు. 

జనసేన కార్యకర్తలు మాత్రం ఆ ఉచ్చులో పడొద్దు. నా ఇష్యూ బ్రో గురించి కాదు.. అంటూ పవన్ కళ్యాణ్ బ్రో వివాదాన్ని సింపుల్ గా కట్ చేసేసారు. సినిమాలను రాజకీయాలను కలపొద్దు.. నేను సినిమాలంటే పిచ్చితో చెయ్యడం లేదు.. కేవలం డబ్బు కోసమే చేస్తున్నాను. సినిమాల్లో కష్టపడి సంపాదించి రాజకీయాల్లో ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాను. సినిమాలంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అలాగని తక్కువ కూడా ఉండదు.. అంటూ పవన్ కళ్యాణ్ బ్రో వివాదాన్ని సున్నితంగా తేల్చేసారు. 

Finally, Pawan reaction on the BRO controversy:

Pawan Kalyan Breaks Silence On BRO Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs