Advertisement
Google Ads BL

వైసీపీ కి చేతినిండా చెప్పనున్న పవన్


బ్రో చిత్రంలో శ్యాంబాబు అంటూ అంబటి రాంబాబుని ఇమిటేట్ చేసారంటూ అంబటి రాంబాబు  గుక్క పెట్టి మీడియాలో గగ్గోలు పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ శ్యాంబాబు పాత్రతో తనని అవమానించాడంటూ రోజుకో ప్రెస్ మీట్, పూటకో ట్వీట్ వేస్తున్నాడు అంబటి. సినిమా ఇండస్ట్రీకి కూడా మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. తనపైన కానీ ఇతర వైసీపీ నేతలపై కానీ సెటైర్స్ వేస్తూ సినిమాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్నాడు. మరి బ్రో లో శాంపిల్ కి చిన్న డైలాగ్ వేస్తేనే అంబటి రాంబాబు మీడియాలో రెచ్చిపోయి చిందులు తొక్కుతున్నాడు. 

Advertisement
CJ Advs

ఒకేవేళ రాబోయే సినిమా మొత్తంలో ఎక్కువ డైలాగ్స్ కనిపిస్తే గుక్కపట్టి ఏడుస్తాడేమో.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుండి రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ లో వైసీపీ పై పంచ్ లు పేలబోతున్నాయని తెలుస్తుంది. హరీష్ శంకర్ సర్కాస్టిక్ గా డైలాగ్స్ రాస్తాడు. పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తే.. హరీష్ రెచ్చిపోయి రాసే డైలాగ్స్ కి వైసీపీ నేతలకి చేతినిండా పనే. ఇప్పుడు అంబటి ఒక్కడే హడావిడి చేస్తున్నాడు. అప్పుడు వైసీపీ పార్టీ మొత్తం దిగుతుంది. 

ఉస్తాద్ భగత్ సింగ్ లో సెటైర్స్ సునామిలా పేలితే వైసీపీ కి మోత మోగిపోవడం ఖాయం.. అప్పుడెలా డిఫెండ్ చేసుకుంటారో ఈ వైసీపీ వాళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Pawan will say a lot to YCP:

Ustaad Bhagat Singh update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs