Advertisement
Google Ads BL

రామ్ సినిమాలో బేబీ హీరోయిన్


బేబీ సినిమాలో నటించకముందు వైష్ణవి చైతన్య యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ లో వెబ్ సీరీస్ ల్లో కనిపించినా చాలా అందంగా - హోమ్లీ గా ఫామిలీస్ కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు బేబీలోను కేరెక్టర్ వైజ్ గా వైష్ణవి కి మంచి పేరొచ్చింది. అయితే ఈ చిత్రం తర్వాత వైష్ణవి చైతన్య కి ఏ హీరో ఆఫర్ ఇస్తారో అనేది ఇప్పుడు అందరిలో అదే క్యూరియాసిటీ కనిపిస్తుంది. అయితే వైష్ణవి చైతన్య ఇంకా బేబీ ప్రమోషన్స్ లోనే కనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో క్లారిటీ లేకపోయినా.. గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. తాజాగా బేబీ కి రామ్ పోతినేని తో నటించే బిగ్ ఛాన్స్ వచినట్లుగా ప్రచారం మొదలయ్యింది. రామ్ ప్రస్తుతం బోయపాటితో స్కంద మూవీ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అవ్వకుండానే రామ్ పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ మొదలు పెట్టేసాడు. ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్ గా పూరి ఎవరిని సెట్ చెయ్యలేదు. 

ఖచ్చితంగా రామ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ నే దింపే ఆలోచనలో పూరి ఉన్నారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చేసింది అంటున్నారు. ఇందులో నిజమెంతుంతో.. ఇది రూమరా లేదా అనేది తెలియాల్సింది. 

Baby actress Vaishnavi Chaitanya grabs a big opportunity?:

Baby heroine in Ram movie?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs