Advertisement
Google Ads BL

సిద్దు ప్లేస్‌లోకి శర్వా


ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ ఫుల్ జోష్‌లో డీజే టిల్లుకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ షూటింగ్‌లో బిజీగా వున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేసింది. డీజే టిల్లులో ఉన్న దానికన్నా కాస్త మోతాదు ఎక్కువగానే టిల్లు స్క్వేర్‌లో రొమాన్స్ కనిపిస్తుంది. అయితే ఈమధ్యన సిద్దు జొన్నలగడ్డ మెగాస్టార్ చిరుతో కలిసి బ్రో డాడీ రీమేక్‌లో నటించబోతున్నాడని అన్నారు. ఆల్మోస్ట్ ఈ కలయిక కన్‌ఫామ్ అయినట్లే అన్నారు. 

Advertisement
CJ Advs

అయితే మళ్ళీ సిద్దు చిరు మూవీలో చెయ్యడం లేదు.. కారణం చిరుతో కలిసి నటిస్తే క్రెడిట్ పై దెబ్బపడుతుందనేలా ఆలోచించి.. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. తాజాగా సిద్దు వదులుకున్న పాత్రలోకి మరో హీరోని ఫిక్స్ చేసినట్లుగా ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.. సిద్దు ప్లేస్‌లోకి వచ్చి చేరాడనే న్యూస్ హైలెట్ అవుతోంది. మెగాస్టార్ చిరు-శర్వా తండ్రీకొడుకులుగా కనబడతారని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చిరు-శర్వా కాంబో దాదాపు ఖరారైనట్టే అన్నట్టుగా వార్తలొస్తున్నాయి. చిరుకి జోడీగా త్రిషని సెలెక్ట్ చేశాడట కళ్యాణ్ కృష్ణ. ఈ చిత్రం మెగాస్టార్ చిరు బర్త్ డే అంటే.. ఆగష్టు 22 నుండి అఫీషియల్‌గా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది.

Sharwanand Replaced Siddu Jonnalagadda:

Sharwanand in Mega Star Bro Daddy Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs