Advertisement
Google Ads BL

ఫైనల్లీ నాగ్ కొత్త సినిమా కబురందింది


కింగ్ నాగార్జున కొత్త సినిమా కబురు కోసం అక్కినేని అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఘోస్ట్ రిలీజ్ అయ్యి కూడా అక్టోబర్‌కి దాదాపుగా ఏడాది పూర్తవుతుంది. అప్పటినుండి నాగార్జున కొత్త సినిమా విషయాలపై ఈ మధ్యన చర్చ జరిగినా అవేమి ఫైనల్ అవ్వలేదు. ప్రసన్న కుమార్‌తో నాగార్జున తదుపరి సినిమా ఉంటుంది అని ఒకసారి, కాదు మలయాళంలో హిట్ అయిన సినిమాని నాగ్ రీమేక్ చేయబోతున్నారని మరోసారి ప్రచారం జరిగింది. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్‌తో బుల్లితెర మీద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. దానితో అభిమానులు నాగార్జున కొత్త సినిమా విషయమై అడుగుతున్నారు. తాజాగా నాగార్జున ఆ కబురుని త్వరలోనే అందించడానికి సిద్ధమయ్యారు. ఈ నెలలోనే నాగార్జున కొత్త సినిమా ప్రకటన రాబోతుంది. ఈ నెల 29న నాగార్జున తన కొత్త సినిమాని ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మరి నాగార్జున ఏ దర్శకుడితో సెట్స్ మీదకి వెళతారో.. ఏ జోనర్‌లో సినిమా చేస్తారో అనే క్యూరియాసిటీ అభిమానులలో పెరిగిపోతోంది.

King Nagarjuna New Film Update Coming Soon:

King Nagarjuna New Film Announcement on the Way
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs