తెలుగమ్మాయి డింపుల్ హయాతి సినిమాల్లో రాణించడానికి చాలా కష్టపడుతుంది. అందాలు చూపించినా గిట్టుబాటు అవడం లేదు. సినిమాల్లో గ్లామర్ చూపించినా అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. వరస డిజాస్టర్స్ ఆమెని ఐరెన్ లెగ్ ని చేసాయి. ఖిలాడీ అట్టర్ ప్లాప్ తర్వాత డింపుల్ హయతి ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ తో కారు పార్కింగ్ విషయంలో గొడవ పడి మీడియాలో హైలెట్ అయిన పాప ఇప్పుడు అవకాశాల కోసం అందాలు పరిచేపనిలో ఉంది.
సోషల్ మీడియాలో తరచూ అందమైన ఫొటోస్ ని మాత్రమే కాదు.. అందాలు ఎంతగా చూపించాలో అంతగా చూపించేస్తుంది. వరస ఫోటో షూట్స్ తో కవ్విస్తుంది. ఇంతగా చూపిస్తున్నా డింపుల్ హయతి కి అవకాశం ఇచ్చే నాధుడు కనిపించడం లేదు. తాజాగా డింపుల్ హయతి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ చూస్తే చాలా బావుంది. పింక్ శారీలో డింపుల్ అందంగానే కనిపించడం కాదు గ్లామర్ షో తో అదరగొట్టేసింది. మరి ఈ ఫోటో షూట్ చూసయినా డింపుల్ కి ఏ హీరో అయినా ఆఫర్ ఇస్తారేమో చూడాలి.