Advertisement
Google Ads BL

ఆసుపత్రిలో చేరిన కేరళ స్టోరీ హీరోయిన్


ఎన్ని సినిమాలు చేసినా ఫలితం దక్కని హీరోయిన్ ఆదా శర్మకి ద కేరళ స్టోరీ విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించినా అదా శర్మ పేరు అంతగా వినిపించలేదు. ఇక హీరోయిన్ గా కనుమరుగవుతుంది అనుకున్న సమయంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఫొటోస్ ని షేర్ చేస్తూ హడావిడి చేసిన ఆదా శర్మకి మలయాళంలో ద కేరళ స్టోరీ అవకాశం ఆమెని హీరోయిన్ గా నించోబెట్టింది. ఆ చిత్రం కాంట్రావర్సీలకి కేరాఫ్ గా అద్భుతమైన కలక్షన్స్ కొల్లగొట్టింది. 

Advertisement
CJ Advs

అయితే ఆదా శర్మ తాజాగా ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు.. తాజాగా ఆమె అనారోగ్యం పాలవడంతో.. వెంటనే ఆదా శర్మని హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆదా శర్మ ఫుడ్ అలర్జీ కారణంగా ఆమె ఒంటిపై దద్దుర్లు, డయేరియాతో ఇబ్బంది పడుతున్నట్టుగా ఆమె ప్రతినిధి తెలియజేసారు. ప్రస్తుతం ఆదా తన తదుపరి చిత్రం కమాండో ప్రమోషన్స్‌లో ఉండగానే ఇలా అనారోగ్యంతో ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. 

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో, భావనా రెడ్డి పాత్రలో అదా శర్మ కనిపించనున్న ఈ చిత్రం ఆగస్టు 11న ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. 

The Kerala Story Actress Adah Sharma Hospitalised:

Adah Sharma Hospitalised, Due To Food Allergy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs