Advertisement
Google Ads BL

నందమూరి వారి వివాహానికి పొంగులేటికి ఆహ్వానం


నందమూరి ఫ్యామిలిలో జరగబోయే పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దివంగత నందమూరి హరికృష్ణ తనయ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ల సిస్టర్ సుహాసిని కుమారుడు హర్ష పెళ్లి ఏర్పాట్లలో నందమూరి ఫ్యామిలీ మునిగిపోయింది. గత మార్చ్ లో కుమారుడి నిశ్సితార్ధాన్ని ఫ్యామిలీ మెంబెర్స్ సమక్షంలో నిర్వహించిన సుహాసిని.. పెళ్లి ని మాత్రం ఘనంగా జరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబందించిన ఆహ్వానాలు ఇటు సినీ అటు రాజకీయ ప్రముఖులకు అందుతున్నాయి.

Advertisement
CJ Advs

అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి నందమూరి కుటుంబంలో జరుగనున్న వివాహానికి ఆహ్వానం అందింది.  హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని తన కుమారుడు హర్ష వివాహానికి రావల్సిందిగా  పొంగులేటిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శుభలేఖ ను అందజేశారు. ఖచ్చితంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులిద్దరికీ తన ఆశీస్సులను అందజేస్తానని ఈ సందర్భంగా పొంగులేటి తనకు శుభలేఖ ను అందచేసిన సుహాసినితో పేర్కొన్నారు.

Nandamuri invitation to Ponguleti for their wedding:

Suhasini Invited Ponguleti Srinivasa Reddy For Her Son Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs