Advertisement
Google Ads BL

BRO థియేటర్ లో ప్రభాస్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లు మొదటిసారి కలిసి నటించిన BRO చిత్రం గత శుక్రవారమే విడుదలైంది. ఈ చిత్రం టాక్ ఎలా ఉన్నా మొదటి మూడు రోజులు పవర్ స్టార్ స్టామినాతో మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే BRO మూవీపై ప్రస్తుతం రాజకీయ వేడి రాజుకుంది. BRO డైలాగ్స్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్స్ తో కాక పుట్టిస్తున్నారు. ఆయనకి ధీటుగా పవన్ ఫాన్స్ బదులుస్తున్నారు. BRO నిర్మాత కూడా అంబటికి  గట్టిగానే ఇచ్చేసారు.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే నేడు BRO మూవీ థియేటర్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ తన ఫ్రెండ్స్ తో కలిసి BRO మూవీని థియేటర్ లో వీక్షించడం చూసిన కొంతమంది ప్రభాస్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే దానిని పవన్ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. BRO సినిమా చూస్తున్న హీరో  ప్రభాస్ గారు అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ హడావిడి అంతా ఇంతా కాదు. మొన్నీమధ్యనే ప్రభాస్ ఫాన్స్-పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇద్దరూ గొడవ పడడం మాత్రమే కాదు ఓ హత్య కూడా జరిగింది. ఈ విషయమై పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రభాస్ ఫాన్స్ కి క్షమాపణలు కూడా చెప్పారు. 

ఇలాంటి సమయంలో ప్రభాస్ పవన్ BRO ని వీక్షించడం మాత్రం నిజంగా హాట్ టాపిక్కే. ప్రస్తుతం ప్రభాస్ థియేటర్ లో BRO మూవీని ఎంజాయ్ చేస్తూ కనిపించిన వీడియో వైరల్ గా మారింది.

Prabhas at BRO Theatre:

Prabhas watches Pawan Kalyan BRO
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs