పూనమ్ కౌర్ చేసే ట్వీట్స్ ఎవరికీ అర్థం కావు కానీ.. అందులో ఏదో అర్థం ఉన్నట్లు మాత్రం తెలిసిపోతుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్‌తో అగ్గి రాజేసే పూనమ్ కౌర్.. తాజాగా చేసిన ట్వీట్‌తోనూ దాదాపు అదే పని చేసింది. అయితే ఈసారి అర్థం కాకుండా ఏం చేయలేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాల పరిస్థితిని విశ్లేషిస్తూ ఆమె చేసిన ట్వీట్ నిజంగా వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే.. ప్రస్తుతం పాలిటిక్స్ వినోదానికి కేరాఫ్ అడ్రస్ అవుతుంటే.. వినోదం అందించాల్సిన సినిమాలు చాలా సీరియస్‌గా మారిపోయాయి.. జస్ట్ ఇది నా ఆలోచన.. అంటూ పూనమ్ కౌర్ తన ట్వీట్‌లో పేర్కొంది. అయితే ఇది నిజంగానే నిజం. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఇదే కనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ సీరియస్ అయిపోయి.. సీరియస్‌గా ఉండాల్సిన పాలిటిక్స్ కామెడీగా మారిపోయాయి.
ఇక ఆమె ట్వీట్ చూసిన వారంతా.. ఇది బ్రో సినిమాకు, అంబటి రాంబాబు మధ్య జరుగుతున్న వార్ గురించే నంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. బ్రో సినిమాలో శ్యాంబాబు అంటూ.. తనని అవమానించారని.. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి గుక్క పెట్టి అంటారు కదా.. అలా అంబటి మైక్ ముందు మాట్లాడుతున్నాడు. సినిమా వాళ్లకి వార్నింగ్స్ ఇస్తున్నాడు. నేనూ సినిమా తీస్తానంటున్నాడు. ఇలా మొత్తంగా ఎంటర్‌టైన్ చేసే కార్యక్రమం ఆయన తీసుకున్నాడనేలా నెటిజన్లు ఆమె ట్వీట్స్‌కు రియాక్ట్ అవుతున్నారు.