Advertisement
Google Ads BL

‘గుంటూరు కారం’ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్


మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ చిత్రంపై ఏ రకంగా వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. అసలు ఈ సినిమా ఉంటుందా? అనేలా కూడా ఇటీవల టాక్ నడిచింది. అస్తమానం మహేష్ బాబు టూర్స్ వేయడం, త్రివిక్రమ్ తనకేం పట్టనట్లుగా బిహేవ్ చేస్తుండటంతో.. సినిమాలో నుంచి ఒక్కొక్కరుగా బయటికి వచ్చేస్తుండటంతో.. ఇక ఈ సినిమా డౌటే అనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. ఎందుకంటే కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ జరగడం లేదు. నటీనటులు, టెక్నీషియన్ల జాబితాలలో మార్పులు, చేర్పులూ.. వంటి విషయాలతో ‘గుంటూరు కారం’ షూటింగ్‌ సవ్యంగా సాగడం లేదనేలా అనుమానాలు సాధారణంగా వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటి అనుమానాలు పెట్టుకున్న వారందరికీ ఇప్పుడో గుడ్ న్యూస్..  

Advertisement
CJ Advs

అతి త్వరలో ‘గుంటూరు కారం’ చిత్రబృందం కొత్త షెడ్యూల్‌కు శ్రీకారం చుట్టబోతోందట‌. ఈ వారంలోనే హైదరాబాద్‌లో ‘గుంటూరు కారం’ సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తో మహేశ్‌, శ్రీలీలపై ఓ గీతాన్ని కూడా తెరకెక్కించనున్నారనేలా టాక్ వినబడుతోంది. సంగీత దర్శకుడు తమన్‌ ఇప్పటికే ఓ అదిరిపోయే ట్యూన్‌ను సిద్ధం చేసినట్టుగా టాక్‌. ఈ చిత్రంలో పాటల హంగామా ఓ రేంజ్‌లో ఉండనుందని అంటున్నారు. 5 పాటలు, మూడు బిట్‌ సాంగ్స్‌ ఉంటాయట.

ఇంకా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బయటికి అలా వార్తలు వినిపిస్తున్నా.. త్రివిక్రమ్ సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ చేసేస్తున్నారట. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందనేది మేకర్స్ క్లారిటీ ఇస్తేగానీ తెలియదు. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.

Good News To Guntur Kaaram Movie Fans:

Guntur Kaaram Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs