పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రంలో వైసీపీ నేత అంబటి రాంబాబుని శ్యాంబాబు కేరెక్టర్‌తో అవమానించారంటూ ఆ చిత్రం విడుదలైన రోజే ప్రెస్ మీట్ పెట్టి, ట్విట్టర్ వేదికగా స్పందించిన అంబటి రాంబాబు.. ఆ సినిమా కలెక్షన్స్ పై చేస్తున్న ట్వీట్స్ కి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ధీటుగా బదులిస్తున్నారు. జనసేన కార్యకర్తలు తమ హీరో సినిమాని కిల్ చెయ్యడానికి వకీల్ సాబ్ దగ్గర నుండి కుట్ర జరుగుతుంది.. భీమ్లా నాయక్ అప్పుడే రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి.. ఇప్పుడు BRO కలెక్షన్స్ వీక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు మీరు.. పవన్ ని ఎదుర్కొలేకే ఇలా ఆయన సినిమాలపై పడుతున్నారంటూ వారు కోపం ప్రదర్శిస్తున్నారు.
శ్యాంబాబు పాత్ర విషయంలో అంబటి రాంబాబు బాగా హార్ట్ అయినట్లుగా ఉన్నారు. అందుకే అయన BRO చిత్ర రచయిత త్రివిక్రమ్‌తో సహా సినిమా ప్రముఖులకు వార్నింగ్ ఇస్తున్నారు. తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న నటులకి, దర్శకులకి, తెలుగు చలన చిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి రాతలు రాసే రచయితలకి మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
దీనిని అర్థం చేసుకోవాలని సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖులకు రాజకీయనాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మీడియా మీట్ పెట్టడం చూస్తే ఆయన BRO లో తనపై వచ్చిన డైలాగ్స్ విషయంలో ఎంతగా హార్ట్ అయ్యారో అర్థమవుతుంది. మరి అంబటి ఇక్కడితో ఆగుతారా? లేదంటే.. అనేది వేచి చూడాల్సి ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొంతమంది అంబటిని ట్యాగ్ చేస్తూ BRO 5 డేస్ కలెక్షన్స్ ప్లీజ్ అంటూ రెచ్చగొడుతున్నారు.