Advertisement
Google Ads BL

శర్వానంద్ కోసం ‘బేబీ ఆన్ బోర్డ్’


శర్వానంద్ కోసం ‘బేబీ ఆన్ బోర్డ్’ అనగానే.. శర్వా ఏమైనా తండ్రి కాబోతున్నాడా? అని అంతా ఊహించేసుకుంటారేమో. అలాంటిదేమీ లేదు. ఎందుకంటే రీసెంట్‌గానే శర్వానంద్‌కి మ్యారేజ్ జరిగింది. ఇప్పుడు ‘బేబీ ఆన్ బోర్డ్’ అంటే అంతా అదే ఊహించేసుకుంటారు. కానీ ఇక్కడ మ్యాటర్‌లో ఉన్న బేబీ మాత్రం వేరు. ఇది శర్వానంద్ తర్వాత సినిమాకు సంబంధించిన అప్‌డేట్. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం శర్వానంద్, ‘హీరో’, ‘దేవదాస్’ వంటి చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఇందులో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని ‘బేబీ ఆన్ బోర్డ్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్నట్లుగా సమాచారం. మరి ఇదే ఫైనల్ టైటిల్ అవుతుందో.. మరో టైటిల్ ఫిక్స్ చేస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే యూనిట్ అంతా ఈ చిత్రాన్ని ‘బేబీ ఆన్ బోర్డ్’ (BOB) అని పిలుచుకుంటున్నారట.

శర్వానంద్ విషయానికి వస్తే.. శర్వాకి సరైన హిట్ పడి చాలా కాలం అవుతుంది. రీసెంట్‌గా వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ దిశగా పయనించలేకపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు చేసిన కొన్ని చిత్రాలు కూడా దాదాపు హిట్ వరకు వెళ్లి ఆగిపోయాయి. మరో వైపు ఇండస్ట్రీలో కుర్ర హీరోల పోటీ బాగా పెరిగిపోతున్న దశలో.. శర్వా నిలబడాలంటే.. కచ్చితంగా హిట్ కొట్టాలి. మరి ఆ హిట్ ఈ BOB ఇస్తుందేమో చూడాలి. 

Baby on Board for Hero Sharwanand:

Sharwanand and Sriram Adittya Movie Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs