ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరోయిన్స్ నభ నటేష్, నిధి అగర్వాల్ లు టాలీవుడ్ లో బాగా బిజీ అవుతారు. అందాలు ఆరబొయ్యడంలో ఇద్దరూ తగ్గలేదు. ఇకపై వీరికి స్టార్స్ సినిమాల్లో అవకాశాలు గ్యారెంటీ అనుకుంటే.. నిధి అగర్వాల్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సెట్స్ లోకి వెళ్ళింది. అలా వెళ్లి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు నిధికి మరో ప్రాజెక్ట్ లేదు. ఇక నభ నటేష్ అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ లో కనబడలేదు. కారణం ఆమెకి జరిగిన యాక్సిడెంట్.
నభ నటేష్ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. అయితే తనకి యాక్సియెంట్ జరిగి చావుకి దగ్గరై మళ్ళీ బ్రతికాను అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. వారానికో గ్లామర్ ఫోటో షూట్ వదులుతూ అందరిని కవ్విస్తుంది. అందాలు ఆరబోసే అవుట్ ఫిట్స్ తోనే గ్లామర్ గా ఫోటో షూట్స్ చేయించుకుని వాటిని సోషల్ మీడియా వేదికగా వదులుతుంది. దర్శకనిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. తాను గ్లామర్ చూపించడానికి ఎంతకైనా రెడీ అని.
ఎన్ని గ్లామర్ షూట్స్ వదిలినా పాపకి పని జరగడం లేదు. ప్రస్తుతం ఫామ్ లో లేని నభ నటేష్ ని పట్టించుకున్న నాధుడు లేదు. ప్రస్తుతం నభ నటేష్ కత్తిలాంటి గ్లామర్ షూట్ ని వదిలింది. వైట్ కలర్ వెరైటీ అవుట్ ఫిట్ లో అందాలు పరిచేసింది. అది చూసిన నెటిజెన్స్ ఈ పాపని కాస్త పట్టించుకోండ్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.