Advertisement
Google Ads BL

BRO పై అంబటి ట్వీట్: పవన్ ఫాన్స్ పంచ్


అంబటి రాంబాబు BRO సినిమాపై, ఆ సినిమా కలెక్షన్స్ పై వరసగా సెటేరికల్ గా ట్వీట్స్ చేస్తున్నారు. BRO కి కలెక్షన్స్ లేవు అని చెప్పకనే చెబుతూ ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు ! ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు !! @PawanKalyan, @vishwaprasadtg అంటూ పవన్ కళ్యాణ్ ని BRO నిర్మాత టిజి విశ్వప్రసాద్ ని ట్యాగ్ చేసారు. మరి అంబటి తమ హీరోపై పంచ్ డైలాగ్ వేస్తూ ట్వీట్ చేస్తే పవన్ ఫాన్స్ ఊరుకుంటారా.. జనసేన కార్యకర్తలు బదులివ్వకుండా ఉంటారా.. కేవలం అంబటికే కాదు.. జగన్ ప్రభుత్వానికి కూడా జనసేన నేతలు, పవన్ ఫాన్స్ పవర్ ఫుల్ పంచ్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

పవన్ ఫాన్స్ అయితే..

ఇక్కడ ట్వీట్లు ఏమో ఫుల్లు! 

మంత్రిగా మార్కులేమో నిల్లు!!

కలెక్షన్స్ ట్రాక్ చెయ్యడానికి సినిమా వెబ్సైట్లు ఉన్నాయి... మీరు ఎక్కువ కష్టపడకండి సార్! మిమ్మల్ని గెలిపించింది పోలవరం లాంటివి పూర్తి చేస్తారని..పోలవరం ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయండి 🙏 అంటూ రిప్లై ఇచ్చారు.

ఇక జనసేన నేతలు మాత్రం..

• వకీల్ సాబ్ అని అర్థరాత్రి జీవో తయారుచేసేలా అధికారులను ఉరుకులు పెట్టించారు

• భీమ్లా నాయక్ అని వచ్చి మంత్రులను, MLA లను థియేటర్ దగ్గర గేట్ కీపర్లుగా మార్చారు

• #BRO గా వచ్చి మంత్రులతో సినిమా రివ్యూలు, కలెక్షన్లు చెప్పిస్తున్నారు.

151 మందిని మీ సినిమాల ప్రమోషన్ కోసం వాడుకుంటే పాపం వారు పెజా సేవ ఎప్పుడు చేస్తారు, ఆంబోతు రాంబాబు @AmbatiRambabu పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తాడు? అసలే జగ్గు భాయ్ & కో కి పెజా సేవ అంటే ప్రాణం.

#HelloAP_ByeByeYCP 

#HelloAP_WelcomeJSP అనే హాష్ ట్యాగ్స్ జత చేసి అంబటి రాంబాబు కి జగన్ ప్రభుత్వానికి హోల్సేల్ పంచ్ లు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Tweet on BRO: Pawan fans punch:

Janasena Strong Counter to Ambati Rambabu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs